ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పాము, ఉడతల పోరాటం.. మధ్యలో నేనున్నా అంటూ ఎగిరొచ్చిన పక్షి..

ABN, First Publish Date - 2022-08-03T03:06:29+05:30

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని వీడియోలైతే తెగ వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య పోరాటం సాధారణంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. కొన్ని వీడియోలైతే తెగ వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య పోరాటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఒకదానికి ఒకటి సాయం చేసుకోవడం కూడా చూస్తుంటాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. పాము, ఉడతలు పోట్లాడుకుంటుంటాయి. అయితే మధ్యలో ఓ పక్షి నేనున్నా అంటూ అక్కడికొచ్చి పాముతో తలపడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ గోడపై ఒకవైపు పాము, మరోవైపు ఉడత ఎదురెదురుగా వస్తాయి. దీంతో ఒక్కసారిగా వాటి మధ్య పోరాటం మొదలవుతుంది. పాము బుసలు కొడుతూ మీదకు వస్తున్నా.. ఉడత ఏమాత్రం భయపడకుండా తలబడుతుంది. కొద్దిసేపటి తర్వాత పాము ఉడుతపై పైచేయి సాధిస్తుంది. ఈ క్రమంలో ఉడత వెనకంజ వేస్తుంది. అదే సమయంలో ఒక్కసారిగా ఓ పక్షి ఎగురుకుంటూ అక్కడికి వస్తుంది. ఉడతకు తోడుగా నేనున్నా.. అంటూ పాముపై తన ప్రతాపం చూపిస్తుంది. గాలిలో ఎగురుతూనే పాముకు చుక్కలు చూపిస్తుంది. దాని దాటికి పాము పైనుంచి కిందపడిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ముద్దు పెట్టి మరీ చింపాంజీ చేసిన లవ్ ప్రపోజ్‌కు.. సిగ్గుపడిపోయిన యువతి.. అవాక్కవుతున్న నెటిజన్లు..





Updated Date - 2022-08-03T03:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising