ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raksha Bandhan: చెల్లెలి కోసం దొంగగా మారిన అన్న

ABN, First Publish Date - 2022-08-01T17:47:23+05:30

రక్షాబంధన్ పండుగ(Raksha Bandhan) సందర్భంగా తన సోదరికి(Sister) ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా(Gift) ఇచ్చేందుకు ఓ అన్న దొంగగా(Theft Accused) మారిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాఖీ సందర్భంగా సోదరికి బహుమతి ఇచ్చేందుకే చోరీలు...ఓ దొంగ నిర్వాకం

న్యూఢిల్లీ : రక్షాబంధన్ పండుగ(Raksha Bandhan) సందర్భంగా తన సోదరికి(Sister) ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా(Gift) ఇచ్చేందుకు ఓ అన్న దొంగగా(Theft Accused) మారిన ఉదంతం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో (delhi)వెలుగుచూసింది. పలు చోరీ కేసుల్లో నిందితుడైన తరుణ్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు(arrest) చేసి ప్రశ్నించగా, రాఖీ పండుగ(raksha bandhan festival) సందర్భంగా తన సోదరికి ఎలక్ట్రిక్ స్కూటరును (E Scooter)బహుమతిగా ఇవ్వడం కోసం తాను చోరీలు చేశానని వెల్లడించాడు.


 ఢిల్లీ నగరంలోని సుల్తాన్ పురి పోలీసుస్టేషన్ పరిధిలో జులై 7వతేదీన తన ఇంట్లో ఓ దొంగ దోపిడీకి యత్నించగా తాను అడ్డుకోవడంతో దొంగ పారిపోతూ అతని సెల్ ఫోన్‌ను(cell phone) వదిలేశాడని సురేంద్ర అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ యత్నంపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగ వదిలివెళ్లిన సెల్ ఫోన్ ఆధారంగా నిందితుడు రోహిణి ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తరుణ్ అని గుర్తించామని అవుటర్ ఢిల్లీ జోన్ సీనియర్ పోలీసు అధికారి సమీర్ శర్మ చెప్పారు. తరుణ్ ను అరెస్టు చేసి విచారించగా చోరీల వెనుక పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.


 తన సోదరికి రాఖీ పండుగ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటరును బహుమతిగా ఇచ్చేందుకే(sister gift for rakhi) విజయ్ విహార్ ప్రాంతంలో ద్విచక్రవాహనంతోపాటు పలు చోరీలు చేశానని తరుణ్ అంగీకరించాడు. నిందితుడు తరుణ్ ను ఇంటరాగేట్ చేయగా అతను చేసిన ఆరు చోరీ కేసులు వెలుగుచూశాయి. తాను స్కూలు చదువును (school dropout) మధ్యలో ఆపేసి చోరీలకు అలవాటు పడ్డానని తరుణ్ చెప్పాడు. 10 చోరీల కేసుల్లో నిందితుడైన తరుణ్ ను అరెస్టు చేసిన పోలీసులు(Police) రిమాండుకు తరలించారు. సోదరి సంతోషం కోసమే అన్న దొంగగా మారిన ఘటన ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2022-08-01T17:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising