ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిమింగలం వాంతి ఖరీదెంతో తెలిస్తే కంగుతింటారు.. దాని ప్రయోజనం తెలిస్తే కాళ్లు భూమిమీద నిలవవు!

ABN, First Publish Date - 2022-01-09T14:41:18+05:30

తిమింగలం వాంతి ఒక రకమైన వ్యర్థ పదార్థం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమధ్య మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌లో ఇద్దరు వ్యక్తుల నుంచి 550 గ్రాముల తిమింగలం వాంతులును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని ధర రూ.1.1 కోట్లకు పైగా ఉంటుందని తేలింది. ఇంతకీ తిమింగలం వాంతిలో ఏముంటుంది? దాని విలువ కోట్లలో ఎందుకు ఉంటుంది? దానితో ఏమి ప్రయోజనం? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

తిమింగలం వాంతి ఒక రకమైన వ్యర్థ పదార్థం. ఇది తిమింగలపు ప్రేగుల నుండి బయటకు వస్తుంది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం తిమింగలాలు సముద్రంలోని పదార్థాలను తింటాయి. అయితే ఆ తిన్నవాటినన్నింటినీ జీర్ణించుకోలేవు. దీంతో వాటిని అవి నోటి ద్వారా బయటకు వదులుతాయి. దీనిని అంబర్‌గ్రీస్ అని అంటారు. ఇది తిమింగలపు ప్రేగులలో తయారవుతుంది. దాని వాంతి ద్వారా బయటకు వస్తుంది. ఈ వాంతి వ్యర్థం పసుపు రంగులో ఉంటుంది. ఆ తరువాత గోధుమరంగు మైనపు ముద్దలా తయారవుతుంది. అనంతరం బూడిద రంగు లేదా నలుపు రంగుకు మారుతుంది. ఇది గట్టిగా మారిపోతుంది. దుర్వాసన కలిగివుంటుంది. తిమింగలం వాంతిని పెర్ఫ్యూమ్ తయారీలో ఉపయోగిస్తారు. విశేషమేమిటంటే.. ఈ వాంతి నుంచి తయారైన పెర్ఫ్యూమ్ సువాసన ఎక్కువ కాలం ఉంటుంది.


పలు ఔషధాల తయారీలోనూ ఈ తిమింగల వాంతిని వినియోగిస్తారు. అందుకే దీని ధర కోట్లలో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తిమింగలం వాంతికి మంచి డిమాండ్‌ ఉంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 6 కిలోల తిమింగలం వాంతి ధర ఒక కోటీ 67 లక్షల రూపాయలు. తిమింగలం వాంతి క్వాలిటీని అనుసరించి దీని ధర నిర్ణయిస్తారు. ఉదాహరణకు మహారాష్ట్రలో దొరికే అంబర్‌గ్రిస్ ధర రూ. 1.1 కోట్లుగా అంచనా. అంబర్‌గ్రీస్ అమ్మకం చట్టవిరుద్ధం. స్పెర్మ్ వేల్ అంతరించిపోతున్న జాతి. దీనిని  వన్యప్రాణుల రక్షణ చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. అంబర్‌గ్రీస్‌ ఖరీదు కోట్లలో ఉండడంతో పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటుంది. 

Updated Date - 2022-01-09T14:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising