ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mati Temple Grottoes: మతి టెంపుల్.. గ్రోటోస్ భవనాలు, కుడ్యచిత్రాలు, బుద్ధ విగ్రహం, పురాతన అవశేషాలను సందర్శించిరండి.

ABN, First Publish Date - 2022-08-26T20:53:59+05:30

ఈ పర్వతం చెక్కడానికి అనువుగాలేని ఎర్రటి ఇసుకరాయితో ఏర్పడటం వలన ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ మట్టితో చేసినవే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మతి టెంపుల్ చైనాలోని ముఖ్యమైన బుద్ధ గ్రోటోలలో ఒకటి. పెద్ద కొండకు వాలుగా నిర్మించిన గుహమాదిరిగా కనిపించే ఈ కట్టడం దాదాపు చాలా శతాబ్దాల చరిత్రకలది. ఎంతో చరిత్రను కలిగిన ఈ ప్రదేశాన్ని ఎంతో ప్రేయాసకు ఓర్చి చేరుకోవాలి. ఎత్తైన ప్రదేశం కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకోవడం కూడా తప్పనిసరి.


ఇది గన్సు ప్రావిన్స్ లోని దక్షిణ యుగుర్ మైనారిటీ అటానమస్ కౌంటీ నుండి 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న లిన్ సాంగ్ పర్వతంలో ఉంది. గ్రోటోలను నార్త్ టెంపుల్, సౌత్ టెంపుల్ వెయ్యి బుద్ధ గుహలు, గోల్డన్ పగోడా టెంపుల్, అవలోకితేశ్వర గుహలు మొదలైనవి ఉన్నాయి. ఈ పర్వతం చెక్కడానికి అనువుగాలేని ఎర్రటి ఇసుకరాయితో ఏర్పడటం వలన ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ మట్టితో చేసినవే. 


మతి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో సరైన అధికారిక రికార్డులు లేవు. 


గ్రోటోలను ఈ కింది విధంగా చెప్పచ్చు.

గువో గుహను చెక్కిన తరువాత సంతానం దానిని విస్తరించారట. లోపలి బౌద్ద శిల్పాలను కూడా నిర్మించారు. గోట్రోల ఆకారం,బౌద్ధ శిల్పాల శైలి నుండి గోల్డెన్ పగోడా టెంపుల్, నార్త్ టెంపుల్, థౌజండ్ కేవ్ లలోని కొన్ని భాగాలను మాత్రం 5, 6 శతాబ్దాలలో నిర్మించారు. మరికొన్ని 5వ శతాబ్దంలో ప్రారంభించారు, సాధారణంగా మతి దేవాలయం ఉత్తర లియాంగ్ కంట్రీ రాజు జు క్యూ మెంగ్ జున్ చేత పునరుద్దరించబడ్డాయి. 


ప్రతి విభాగంలోనూ గ్రోటోస్..

గోల్డెన్ పగోడా టెంపుల్ లో మతి దేవాలయం 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 60 మీటర్ల ఎత్తైన కొండ చరియలపై ఈ గుహలను తవ్వారు. పగోడా ఆకారంలో ఉన్న రెండు కేంద్ర సహాయక గుహలు వీటిలో ఉన్నాయి. ఉత్తర రాజవంశం గ్రోటోలు ఎక్కువగా వెయ్యి బుద్ధ గుహలో ఉన్నాయి. మతి ఆలయానికి వాయువ్య భాగంలో 10 కంటే పగోడా ఆకారంలో ఉన్న కేంద్ర సహాయక గుహ, సంరక్షించబడిన శిల్పాలు, రాజవంశాల కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. 


మాతి పర్వతం ఉత్తర ఆలయంలో 30 కంటే ఎక్కువ గ్రోటోలు ఉంటాయి. ఇవి ఉత్తర, పశ్చిమ, జియా, యువాన్, మింగ్ రాజవంశాలలో చాలా గ్రోటోలు. లోపల ఉన్న శిల్పాలు ఇప్పటికీ అసలు రూపాన్ని కలిగి ఉన్నాయి. శిల్పాల ముఖాలపై గొప్ప వ్యక్తీకరణలు, శిల్పాల శరీరాలపై విస్తృతమైన అలంకరణలు, ఫ్లయింగ్ అప్సరస్ కళ, ఇవన్నీ చైనా ప్రారంభ దశ గ్రోటోల యొక్క అధిక విజయాలను చూపుతాయి.


ఇది చైనాలోని మొదటి మూడు హెక్సీ బౌద్ధమత సంస్కృతి గ్రోటోలలో ఒకటి., ఇక్కడి వరకూ చేరి అలనాటి వైభవానికి ప్రతీకలైన భౌద్ధ సంపదను చూడడం మంచి అనుభూతిని ఇస్తుంది. 









Updated Date - 2022-08-26T20:53:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising