ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇలాంటి వీడియో మీరెప్పుడూ చూసుండరు.. చూస్తే షాక్ తప్పదు!

ABN, First Publish Date - 2022-05-25T02:06:35+05:30

రోడ్డు ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: రోడ్డు ప్రయాణంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గాయాలతో బయటపడితే మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా, సురక్షిత ప్రయాణాలపై అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు నిర్లక్ష్యం వీడడం లేదని చెప్పేందుకు ఈ వీడియో చక్కని ఉదాహరణ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టకమానరు. ఒక్క స్కూటర్‌పై ఏకంగా ఆరుగురు వ్యక్తులు ఎంచక్కా, ఎలాంటి బెదురు లేకుండా ప్రయాణిస్తున్నారు. ముంబైలోని రద్దీ రోడ్డుపై ప్రయాణిస్తూ కనిపించిన వీరిని రమణదీప్ సింగ్ హోరా అనే ట్విట్టర్ యూజర్ వీడియో తీసి షేర్ చేస్తూ ముంబై పోలీసులను ట్యాగ్ చేశాడు.


స్కూటర్‌కున్న చిన్న సీటుపై ఐదుగురు సర్దుకుని కూర్చోగా, వెనక కూర్చున్న వ్యక్తి భుజాలపై మరొకరు కూర్చోవడం విస్తుగొలుపుతోంది. రమణదీప్ ట్వీట్‌కు స్పందించిన పోలీసులు వారిపై చర్యలు తీసుకుంటామని, సరిగ్గా ఎక్కడ చూశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి ఆయన అంధేరి వెస్ట్‌లోని స్టార్ బజార్ వద్ద అని బదులిచ్చాడు. 

 

ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘బాప్‌రే.. స్కూటర్‌కు బదులుగా వారివద్ద కారుంటే.. ఎంతమందిని కుక్కేసేవాడో.. ఎవరైనా ఊహించగలరా?’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. కాగా, భారత్‌లోని ట్రాఫిక్ చట్టాలు బైక్‌పై డ్రైవర్ కాకుండా మరొకరిని మాత్రమే అనుమతిస్తాయి. అయితే, తరచూ ఈ నిబంధన గాల్లో కలిసిపోతూ ఉంటుంది. 



Updated Date - 2022-05-25T02:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising