ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral video: పావురం ప్రాణాలు కాపాడేందుకు మూడు గంటల ప్రయత్నం.. చివరకు

ABN, First Publish Date - 2022-05-02T08:25:04+05:30

ఒక పావురాన్ని కాపాడేందుకు కొందరు వ్యక్తులు మూడు గంటల పాటు శ్రమించారు.. విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయి అల్లాడుతున్న పావురాన్ని సురక్షితంగా రక్షించారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక పావురాన్ని కాపాడేందుకు కొందరు వ్యక్తులు మూడు గంటల పాటు శ్రమించారు.. విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయి అల్లాడుతున్న పావురాన్ని సురక్షితంగా రక్షించారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా కుంకూరిలో ఈ ఘటన జరిగింది. 


 కుంకూరి పట్టణంలో ఓ పావురం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. ఈ పావురం కాళ్లకు తాడు కట్టి ఉండడంతో అది విద్యుత్ తీగలకు చిక్కుకుంది. పావురం వైర్లలో ఇరుక్కుపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు దానిని కాపాడేందుకు ప్రయత్నించారు. వెదురు కర్రతో దానిని వైర్ల నుంచి తప్పించేందుకు చాలా సేపు ప్రయత్నించారు. అయినా కాపాడలేకపోయారు. దీంతో విద్యుత్ శాఖకు సమాచారం అందించి సరఫరా నిలిపి వేయించారు. 


విద్యుత్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కరెంటు కట్ చేసి పావురాన్ని రక్షించారు. విద్యుత్ శాఖ ఉద్యోగి నిచ్చెన ఎక్కి పావురాన్ని వైర్ల నుంచి తప్పించి కిందకు దించాడు. మూడు గంటల పాటు అలా వేలాడుతూ ఉండడంతో పావురు అస్వస్థకు గురైంది. స్థానికులు ఆ పావురానికి మంచి నీళ్లు పట్టించి, చికిత్స చేశారు. దాదాపు అరగంట తర్వాత ఆ పావురం ఆకాశంలోకి ఎగిరిపోయింది. 




Updated Date - 2022-05-02T08:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising