ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై వరద ప్రవాహం... వాహనాన్ని దాటిద్దామనుకున్న డ్రైవర్... ఊహించని విధంగా ఏం జరిగిందంటే...

ABN, First Publish Date - 2022-07-16T13:38:52+05:30

ప్రకృతిని ఎదిరిస్తే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకృతిని ఎదిరిస్తే జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ వీడియోలో చూడవచ్చు. ఒక కారు డ్రైవర్ బలమైన నీటి ప్రవాహంలో వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, అది లోతైన నీటిలో పడిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. 


వైరల్ అయిన వీడియోలో వరదనీరు రహదారిపై ప్రవహించడాన్ని చూడవచ్చు. వరద కారణంగా వంతెన పైనుండి నీరు పొంగిపొర్లడాన్ని గమనించవచ్చు. మరోవైపు కొన్ని వాహనాలు నిలిపివుంచిన స్థితిలో కనిపిస్తాయి. అయితే ఒక కారు డ్రైవర్ వాహనాన్ని స్ట్రెయిట్‌గా నడిపి, వరద నీటిని క్రాస్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే బలమైన నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకున్న కారు అవతలి వైపునకు కొట్టుకువెళ్లి లోతైన నీటిలో పడిపోతుంది. ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 94 వేలకు పైగా వీక్షించారు.

Updated Date - 2022-07-16T13:38:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising