ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Buffallo Inaugration: దున్నపోతుతో బస్‌ షెల్టర్‌ ప్రారంభోత్సవం.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-07-24T03:05:47+05:30

ఎన్నికలు అయిపోతే చాలు.. ఇక ప్రజా ప్రతినిధులు ప్రజల్ని పట్టించుకోరనేది జగమెరిగిన సత్యం. ఇక కొంతమంది అధికారులైతే ఉద్యోగం చేస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో మొద్దు నిద్ర..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికలు అయిపోతే చాలు.. ఇక ప్రజా ప్రతినిధులు ప్రజల్ని పట్టించుకోరనేది జగమెరిగిన సత్యం. ఇక కొంతమంది అధికారులైతే ఉద్యోగం చేస్తున్నా సమస్యలను పరిష్కరించడంలో మొద్దు నిద్ర ప్రదర్శిస్తారు. అలాంటి అధికారుల తీరు పట్ల కర్ణాటకలోని ఓ గ్రామ ప్రజలు వినూత్నంగా నిరసన తెలియజేశారు. ఓ దున్నపోతుతో బస్‌ షెల్టర్‌కు రిబ్బన్ కట్ చేయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


గడగ్‌ జిల్లా బాలెహుసుర్ గ్రామంలో 40 ఏళ్ల క్రితం నిర్మించిన బస్‌ షెల్టర్ శిథిలావస్థకు చేరుకుంది. దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా స్పందించలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం బస్ షెల్టర్ ధ్వంసమైంది. బస్ షెల్టర్‌ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు తెలియజేసినా స్పందించకపోవడంతో గ్రామస్తులు విరాళాలు సేకరించి, కొబ్బరి మట్టలతో తాత్కాలిక షెల్టర్‌ను నిర్మించారు. అంతే కాక అలా నిర్మించిన బస్ షెల్టర్‌ ప్రారంభోత్సవానికి దున్నపోతును చీఫ్ గెస్ట్‌గా తీసుకెళ్లి, రిబ్బన్ కట్ చేయించారు. గ్రామంలో బస్‌ షెల్టర్ సమస్య గురించి తనకు తెలియదన్న ఎమ్మెల్యే.. త్వరలోనే బస్ షెల్టర్‌ నిర్మాణానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Viral Video: ఈ యువతికి సడన్‌గా ఎంత కోపం వచ్చింది.. నువ్వు ఎవడైతే నాకేంటీ.. అంటూ ఒక్కసారిగా..



Updated Date - 2022-07-24T03:05:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising