ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నెటిజన్లను కట్టిపడేస్తున్న 15 సెకన్ల వీడియో.. ఇది కదా భార్యాభర్తల బంధం అంటే..!

ABN, First Publish Date - 2022-09-21T01:42:35+05:30

ఓ మహిళా ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రేమంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది చూపించండి అంటూ ఆమె షేర్ చేసిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలకే దంపతులు విడిపోతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, భాగస్వామిపై అసంతృప్తి కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. సమాజంలో వివాహబంధానికున్న ప్రాముఖ్యతను ప్రశ్నార్థకం చేస్తున్న పరిణామాలివి. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఐఏఎస్ అధికారి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.  ప్రేమంటే ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది చూపించండి అంటూ ఆమె షేర్ చేసిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది. 


ఐఏఎస్ అధికారి డా. సుమిత్ర మిశ్రా(Dr. Sumitra Misra) ఈ వీడియోను షేర్ చేశారు. ఇది ఓ వృద్ధ జంటకు(Elderly couple) చెందిన వీడియో. తనపనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న భర్తకు భార్య ఆహారాన్ని, పానీయాన్ని నోటికి అందిస్తూ ఆయనపై తనకున్న ఆపేక్షను చాటుకుంది. తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని చేతులు వణుకుతున్నా కూడా లెక్క చేయకుండా భర్తకు ఆహారాన్ని అందిస్తుంది. ఇది కేవలం 15 సెకెన్ల వీడియోనే..! కానీ.. ఓ జీవితకాలం పాటు వారు పోగేసున్న ఆప్యాయతానురాగాలను కళ్లకుకట్టినట్టు చూపించింది. దీనిపై డా.సుమిత్ర ఆసక్తికర కామెంట్ చేశారు. ప్రేమ(Love) అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే..ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పండి అని వ్యాఖ్యానించారు. ఆ వృద్ధదంపతుల అనుబంధం(Wife Husband Relationship) మాటలకు అందనిదని చెప్పకనే చెప్పారు. 


ఇక వీడియో ఎంతగా వైరల్(Viral) అవుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో ఇది. వేలల్లో లైక్స్ వచ్చిపడుతున్నాయి. జీవనపోరాటంలో బిజీ బిజీగా గడిపేసిన వారిని వృద్ధాప్యం మరింత దగ్గర చేసిందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు.  ఇక డా. సుమిత్రా మిశ్రా..హరియాణా వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు చీఫ్ సెక్రెటరీగా పనిచేస్తున్నారు. హరియాణా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్‌పర్సన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి నెటిజన్లను ఇంతగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరూ ఓమారు చూసేయండి. 



Updated Date - 2022-09-21T01:42:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising