ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సరిగమప లిటిల్ ఛాంప్స్ తెలుసుగా.. అయితే ఇది మాత్రం చూసి తీరాల్సిందే..

ABN, First Publish Date - 2022-09-19T01:36:22+05:30

సరిగమప లిటిల్ ఛాంప్స్ తెలుసుగా.. అయితే ఇది మాత్రం చూసి తీరాల్సిందే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పిల్లల్లో దేవుడు ఉంటారంటారు! బహుశా అందుకేనేమో.. వారు ఆడినా, పాడినా, అల్లరి చేసినా అద్భుతంగానే ఉంటుంది. ఇక మంచి స్వరంతో చిన్నారులు ఓ పాట అందుకున్నారంటే.. పెద్దలు అన్నీ మర్చిపోయి పాటలో లీనమైపోవాల్సిందే. పిల్లలు పాటల వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యేది అందుకే. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం మన తెలుగు వీక్షకులను మైమరపిస్తోంది. ఆ వీడియో ఎవరిదో కాదు.. సరిగమప లిటిల్ ఛాంప్స్ కార్యక్రమం(Sa Re Ga Ma Pa Li'l Champs) ఛాంపియన్ ఆవిర్భవ్‌ది. ఈ షో ప్రేక్షకులకు అనిర్విణ్య- ఆవిర్భవ్‌ (Aniirvinnhya & Avirbhav) ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిట్టి చిరుతలు రేంజ్ అలాంటిది. 


ఇక షో న్యాయనిర్ణేతలతో కింగ్ ఆవిర్భవ్‌సంభాషించిన ఓ వీడియో చూసిన నెటిజన్లు ప్రస్తుతం తెగ ముచ్చటపడిపోతున్నారు. కారణం.. ఆవిర్భవ్‌ పలికిన చిలకపలుకులే.! ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. చిన్నతనం అంటేనే బిడియం.. అమాయకత్వం..! కొత్త వారిని చూడాలంటేనే కొందరు చిన్నారులు భయంతో తల్లివెనుక దాక్కుంటుంటారు. కానీ.. ఆవిర్భవ్ మాత్రం అసలేమాత్రం బెరుకు లేకుండా.. ముద్దుమాటలతో న్యాయనిర్ణేతలు ఆశ్చర్యపోయేలా చేశాడు. అతడి పాట విని ముగ్ధుడైపోయిన చంద్రబోస్.. ముందుగా మన చిచ్చరపిడుగును ప్రశంసించారు. సంగీత ప్రపంచంలో ఇదో అద్భుతమైన ఘట్టంగా భావిస్తున్నా అనగానే.. థ్యాంక్యూ సర్ అంటూ ఆవిర్భవ్ టక్కున రెస్పాండవడం చంద్రబోస్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. బుడ్డోడికి ఆ వాక్యాల్లోని భావం ఎంత అర్థమైందో తెలీదు కానీ.. చంద్రబోస్ మాత్రం పిల్లాడి రెస్పాన్స్‌కు ముగ్ధుడైపోయారు. 


అది మొదలు న్యాయనిర్ణేతలందరూ పిల్లాడి తీరుకు వరుసగా ఫిదా అయిపోయారు. ప్రముఖ గాయని ఎస్పీ శైలజ మాట్లాడుతూ.. మనోడు ప్రహ్లాదుడిలా ఉన్నాడంటూ మెచ్చుకున్నారు. తల్లి కడుపులోనే అన్నీ నేర్చుకుని బయటపడ్డాడంటూ మురిసిపోయారు. ఆ సమయంలో మనోడి రెస్పాన్స్, ముఖంలో హావభావాలు చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక దేవుడే పిల్లాడికి లాలి పాట పాడితే ఇలా ఉంటుందంటూ విజయ్ ప్రకాశ్ తెగ పొగిడేశారు. సింగర్ మాల్గుడి శుభకు.. మనోడు ఇచ్చిన రెస్పాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. అవి భాషకు అందని హావభావాలు..! కాబట్టి.. ఆలస్యం చేయకుండా మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేయండి..!



Updated Date - 2022-09-19T01:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising