ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నీటి కొలనులో పడిన ఏనుగు పిల్ల కోసం పరుగులు పెట్టిన ఏనుగులు.. చివరకు ఎలా రక్షించాయో చూడండి..

ABN, First Publish Date - 2022-08-16T23:20:44+05:30

తల్లి, బిడ్డల మధ్య అనుబంధం మనుషుల మధ్యే కాదు.. జంతువుల మధ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తల్లి, బిడ్డల మధ్య అనుబంధం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా అదే స్థాయిలో ఉంటుంది. తమ బిడ్డలకు ఆపద వస్తే ఏ తల్లీ తట్టుకోలేదు. బిడ్డ ఆపదలో ఉంటే కాపాడేందుకు ఎంతకైనా తెగిస్తుంది. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. కొలనులో మునిగిపోతున్న ఏనుగు పిల్లను రక్షించేందుకు ఏనుగులు (Elephants Rescuing Calf) చేసిన ప్రయత్నాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Gabriele Corno అనే వ్యక్తి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. దక్షిణ కొరియాలోని సియోల్ జూ (Seoul Zoo)లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో తల్లి, పిల్ల ఎనుగులు కొలను వద్దకు నీరు తాగేందుకు వెళ్లాయి. ఉన్నట్లుండి పిల్ల ఏనుగు కొలనులో పడిపోయింది. వెంటనే తల్లి ఏనుగుతో పాటు పక్కనే ఉన్న మరో ఏనుగు కూడా పరిగెత్తుకుంటూ దానికి కాపాడేందుకు ప్రయత్నించాయి. అయితే ఉపయోగం లేకపోవటంతో రెండు ఏనుగులూ కలిసి కొలనులోకి దిగాయి. మునిగిపోతున్న ఏనుగు పిల్లను రెండూ కలిసి బయటకు లాగాయి.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Updated Date - 2022-08-16T23:20:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising