Viral Video: కొన్నిసార్లు ఇంతే.. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా..!
ABN, First Publish Date - 2022-12-16T11:58:21+05:30
ప్రమాదం ఎప్పుడు ఎటునుంచి ముంచుకొస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుపై ప్రయాణించే సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా.. ఎదువటి వాళ్లు చేసే తప్పులకు..
ఇంటర్నెట్ డెస్క్: ప్రమాదం ఎప్పుడు ఎటునుంచి ముంచుకొస్తుందో చెప్పడం చాలా కష్టం. రోడ్డుపై ప్రయాణించే సమయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా.. ఎదువటి వాళ్లు చేసే తప్పులకు ఇతరులు బలి కావాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇటువంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆ వీడియోను చూసి షాకవుతున్నారు. కాగా.. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా.. ఎదురుగా లారీ వస్తుండటాన్ని గమనిస్తాడు. ఈ క్రమంలో అతడు లారీకి దారిస్తూ రోడ్డు చివరి నుంచి బైక్‌ను తోలుతుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీకి ఉన్న తాడు.. బైక్ వెళ్తున్న యువకుడి మెడకు తగలడంతో అతడు రోడ్డుపై(Bike Accident) పడిపోయాడు. ఈ సమయంలో అటువైపుగా ఎటువంటి ఇతర వాహనాలు రాకపోవడంతో చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేది. తమిళనాడు(Tamil Nadu)లోని తూత్తుకుడి(Thoothukudi) జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అవికాస్తా సోషల్ మీడియాలోకి చేరడంతో.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Updated Date - 2022-12-16T12:00:30+05:30 IST