ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పొట్టేలుతో ఇతడి ఆటలు మామూలుగా లేవుగా.. చూస్తే వామ్మో అని మీరే అంటారు..

ABN, First Publish Date - 2022-02-23T22:39:15+05:30

ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పైకి పొట్టేలు.. కోపంగా దూసుకొస్తుంది. కొమ్ములతో ఒక్క పోటు పొడవాలని చూస్తుంది. అయితే తీరా పొట్టేలు దగ్గరికి వచ్చే క్రమంలో ఆ వ్యక్తి ఒక్క జంప్ చేస్తాడు. దీంతో దూసుకొచ్చిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఏమూల ఏ చిన్న సంఘటన జరిగినా వీడియోతో సహా చూసే వెలుసుబాటు ఉంది. ఈ క్రమంలో విభిన్నంగా ఉన్న వీడియోలు ఎంత వైరల్ అవుతుంటాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇటీవల పొట్టేలు, మనిషికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. చిన్న పిల్లాడితో ఆడుకున్నట్లుగా ఓ వ్యక్తి గొర్రెతో ఆటలాడుకోవడం.. అందరినీ ఆకట్టుకుంటోంది.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పైకి పొట్టేలు.. కోపంగా దూసుకొస్తుంది. కొమ్ములతో ఒక్క పోటు పొడవాలని చూస్తుంది. అయితే తీరా పొట్టేలు దగ్గరికి వచ్చే క్రమంలో ఆ వ్యక్తి ఒక్క జంప్ చేస్తాడు. దీంతో దూసుకొచ్చిన ఆ పొట్టేలు వ్యక్తి కాళ్ల మధ్య నుంచి వెళ్లిపోతుంది. మళ్లీ ఆ వ్యక్తి పైకి దాడి చేసేందుకు వెళ్తుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం మళ్లీ యథావిధిగా పైకి జంప్ చేస్తాడు. విసిగిపోయిన ఆ పొట్టేలు ‘‘ నా నుంచి ఎలా తప్పించుకుని వెళ్తావో చూస్తా’’ అన్నట్లుగా ఆ వ్యక్తిని చుట్టుముడుతుంది. కాస్త ఎత్తుగా ఉండే ప్రదేశానికి వెళ్లిన ఆ వ్యక్తికి ఎదురుగా నిల్చుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

 అంబులెన్స్‌ వెనుకే కిలోమీటర్ల మేర పరుగులు పెట్టిన గుర్రం.. కారణం ఏంటో తెలుసా..





Updated Date - 2022-02-23T22:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising