ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేగంగా వెళ్తున్న రెండు ట్రైన్ల మధ్య.. అంతే వేగంగా పరుగెడుతున్న గుర్రం.. సినిమా కాదు.. రియల్..

ABN, First Publish Date - 2022-01-23T22:09:54+05:30

ఓ తెల్లటి గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అత్యంత వేగంగా ప్రయాణిస్తోన్న రెండు ట్రైన్ల మధ్య.. సదరు గుర్రం అంతే వేగంగా పరుగెడుతుంది. చివరకు ఏమవుతుందో మీరే చూడండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హార్స్ పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్స్ రైడింగ్‌లో ఉన్నంత కిక్.. మరి దేంట్లోనూ ఉండదు. అంతేకాదు గుర్రపు స్వారీ చేస్తే ఆత్మవిశ్వాసంతో పాటూ కొన్ని రకాల వ్యాధులు కూడా నయమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి మిగతా జంతువుల కంటే అత్యంత వేగంగా పరుగెడతాయి కాబట్టే.. మానవులు ఎప్పటి నుంచో వీటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. కొన్ని గుర్రాలు గంటకు సుమారు 80 నుంచి 90కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు. ఇప్పడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. వేగంగా పరుగెడుతున్న ఓ తెల్లటి గుర్రానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అత్యంత వేగంగా ప్రయాణిస్తోన్న రెండు ట్రైన్ల మధ్య.. సదరు గుర్రం అంతే వేగంగా పరుగెడుతుంది. చివరకు ఏమవుతుందో మీరే చూడండి..


వేర్వేరు పట్టాల మీద రెండు రైళ్లు వేగంగా ఎదురుపడడం వీడియోలో చూడొచ్చు. అదే సమయంలో ఓ గుర్రం వాటి మధ్యలో ఇరుక్కుపోతుంది. ఏమాత్రం అదుపుతప్పినా రైళ్ల కింద నలిగిపోయే పరిస్థితి. కానీ ఆ గుర్రం మాత్రం ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా వాటి వేగంతో సమానంగా పరుగెత్తడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గుర్రం ఎలా తప్పించుకుంటుందో అని రైళ్లోని ప్రయాణికులు ఆసక్తిగా గమనిస్తుంటారు. కానీ గుర్రం మాత్రం అదుపుతప్పకుండా అదే వేగంతో వెళ్తుంది. చివరకు ఒక రైలు వెళ్లిపోగానే పక్కనున్న పట్టాల మీదకు వెళ్తుంది. దీంతో ప్రయాణికులంతా హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఊపిరి బిగపట్టుకుని చూడాలనిపించే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ కోతి ఆట ఆడే విధానం చూస్తే.. ఇదెక్కడి కోతిరా నాయనా అంటారు..



Updated Date - 2022-01-23T22:09:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising