ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ముద్దు పెట్టి మరీ చింపాంజీ చేసిన లవ్ ప్రపోజ్‌కు.. సిగ్గుపడిపోయిన యువతి.. అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2022-08-03T00:25:16+05:30

చింపాంజీల (Chimpanzee) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులు చేసే పనులను మక్కీకి మక్కీ దించేస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు ఆశ్చర్యం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింపాంజీల (Chimpanzee) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషులు చేసే పనులను మక్కీకి మక్కీ దించేస్తుంటాయి. కొన్నిసార్లు అవి చేసే పనులు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. దుస్తులు ఉతకడం, వాహనాలను శుభ్రం చేయడం దగ్గర నుంచి పిల్లలను లాలించడం వరకూ అన్ని పనులనూ మనుషులు చేసినట్లే చేస్తుంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా (Social media) లో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ (viral) అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువతికి ముద్దు పెట్టి మరీ చింపాంజీ లవ్ ప్రపోజ్ (Love proposal) చేస్తుంది. దీంతో యువతి తెగ సిగ్గుపడిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 


థాయ్‌లాండ్ (Thailand) లోని బ్యాంకాక్ (Bangkok) లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ చింపాంజీతో కలిసి యువతి ఊయల ఊగుతూ ఉంటుంది. ఈ సమయంలో చింపాజీ ఉన్నట్టుండి యువతి భుజంపై చేయి వేసి ఆలింగనం చేసుకుంటుంది. యువతి మొదట భయం భయంగా ఉన్నా.. చింపాంజీ ఎలాంటి హాని చేయకపోవడంతో నవ్వుతూ ఉంటుంది. అనంతరం యువతి చేయి మీద ముద్దు పెట్టిన చింపాంజీ.. ముఖంపై కూడా ముద్దు పెట్టి, లవ్ ప్రపోజ్ చేస్తున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. పక్కనే ఉన్న ట్రైనర్ గమనిస్తూ, చింపాంజీకి సూచనలు ఇవ్వడం కూడా వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

rare stone: చేపలు పట్టేందుకు వెళ్లిన పిల్లలకు దొరికిన 6కిలోల అరుదైన రాయి.. చూసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు





Updated Date - 2022-08-03T00:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising