ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నపిల్లలే అతని టార్గెట్.. అన్‌లైన్ గేమ్స్ పేరిట లక్షలు దోచుకున్న యువకుడు.. అదెలాగంటే..

ABN, First Publish Date - 2022-05-30T09:01:31+05:30

ఈ కాలంలో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ పబ్జీ, బీజిఎంఐ వంటి అన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కువ మంది వీటిని వ్యసనంగా మార్చుకున్నారు. ఈ అన్‌లైన్ గేమ్స్‌కున్న డిమాండ్ రీత్యా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఈ గేమ్స్ ఆడేందుకు కొత్త టూల్స్ అమ్మానికి వస్తున్నాయి. కానీ ఈ టూల్స్ పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ కాలంలో పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ పబ్జీ, బీజిఎంఐ వంటి అన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఎక్కువ మంది వీటిని వ్యసనంగా మార్చుకున్నారు. ఈ అన్‌లైన్ గేమ్స్‌కున్న డిమాండ్ రీత్యా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో ఈ గేమ్స్ ఆడేందుకు కొత్త టూల్స్ అమ్మానికి వస్తున్నాయి. కానీ ఈ టూల్స్ పేరుతో కొంతమంది సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారు. ఇలాంటి ఒక సైబర్ మోసగాడిని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. అతడు అన్‌లైన్ గేమ్స్‌‌కు అలవాటు పడిన చిన్నపిల్లలను మాత్రమే టార్గెట్ చేసేవాడు.


వివరాల్లోకి వెళితే.. ఉతర్ ప్రదేశ్ ఘాజియాబాద్‌కు చెందిన ఒక ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్‌లైన్ గేమ్ టూల్స్ చెల్లింపుల పేరుతో తన డెబిట్ కార్డు నుంచి డబ్బులు పోయానని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలాంటి ఫిర్యాదులు చాలాకాలంగా పోలీసులు అందుతున్నాయి. పోలీసులు డెబిట్ కార్డు చెల్లింపులను ట్రాక్ చేస్తూ చివరికి ఆ సైబర్ మోసగాడిని పట్టుకున్నారు. కానీ ఆ మోసగాడి గురించి పోలీసులకు అశ్చర్యకర విషయాలు తెలిశాయి.


ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకీలో నివసించే విశాల్(22) అనే యువకుడు ఎంఏ చదువుకుంటున్నాడు. అతనికి మొబైల్ గేమింగ్ ఆడే అలవాటు ఉంది. ఆ గేమ్‌లో త్వరగా నెక్స్ట్ లెవెల్ వెళ్లాలంటే ఒక గేమింగ్ టూల్ అవసరం. ఇంటర్నెట్‌లో ఇలాంటి గేమింగ్ టూల్స్ అమ్మకానికి దొరుకుతున్నాయి. ఆ గేమింగ్ టూల్ కోసమని విశాల్ ఇంటర్నెట్ ద్వారా చెల్లింపులు చేశాడు. కానీ ఆ డబ్బులు సైబర్ నేరగాళ్లు కాజేశారు. తాను మోసపోయానని గ్రహించిన విశాల్‌కి ఒక ఆలోచన వచ్చింది. తాను అలాగే మరొకరికి మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చని ఆలోచించాడు. 


అలా విశాల్ కూడా సైబర్ ఫ్రాడ్‌గా మారిపోయాడు. రెండేళ్ల నుంచి పబ్జీ, బీజియంఐ లాంటి అన్ లైన్ గేమ్స్ ఆడే చిన్నిపిల్లలన టార్గెట్ చేస్తూ గేమింగ్ టూల్స్ కావాలంటే తనకు సంప్రదించాలని ఇన్స్‌టాగ్రాంలో ఒక ఫేక్ ప్రొఫైల్ పెట్టాడు. అది చూసిన చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఆ గేమింగ్ టూల్స్ కొనేందుకు చెల్లింపులు చేసేవారు. ఈ చెల్లింపుల ప్రక్రియలో వారికి ఫోన్‌లో వచ్చే ఓటిపి నెంబర్‌ను కూడా విశాల్ తీసుకొని.. ఆ కార్డు ద్వారా ఇంటర్నెట్‌లో గోల్డ్ కాయిన్స్ కొనేవాడు. ఈ ప్రక్రియ ద్వారా ఇప్పటికి దాదాపు 100 మంది పిల్లల దెగ్గర్ రూ.50 లక్షలు దోచుకున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 




Updated Date - 2022-05-30T09:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising