ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల రోజుల క్రితం కారు దొంగతనం.. దొంగ కోసం పోలీసుల అన్వేషణ.. ఫేస్‌బుక్ సహాయంతో ఎలా పట్టుకున్నారంటే..

ABN, First Publish Date - 2022-01-27T18:03:56+05:30

నెల రోజుల క్రితం ఇంటి ముందు పార్క్ చేసిన అతని కారు పోయింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల రోజుల క్రితం ఇంటి ముందు పార్క్ చేసిన అతని కారు పోయింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.. దీంతో తన ఇంటికి అమర్చిన సీసీటీవీ ఫుటేజ్ చూసి దొంగను గుర్తించాడు.. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.. ఫేస్‌బుక్‌లో ఆ వీడియో చూసిన వ్యక్తి దొంగ వివరాలు చెప్పాడు.. దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, దొంగను అరెస్ట్ చేశారు.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇండోర్‌కు చెందిన ఆకాష్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం తన ఇంటి ముందు కార్క్ పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసే సరికి ఆ కారు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటికి అమర్చిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పోలీసులకు అందించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులు ఆ దొంగ ఆచూకీ కనిపెట్టలేకపోయారు. దీంతో ఆకాష్ ఆ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఆ వీడియోలోని దొంగ ఎక్కడైనా కనబడితే తెలపాలని విజ్ఞప్తి చేశాడు. ఆకాష్ స్నేహితులందరూ ఆ వీడియో చూశారు. 


ఆకాష్ కారును దొంగిలించిన వ్యక్తి 20 రోజుల అనంతరం దానిని అమ్మేందుకు ప్రయత్నించాడు. ఇండోర్‌లోని దేవస్ ప్రాంతానికి ఆ కారును తీసుకెళ్లి అమ్మేందుకు ప్రయత్నించాడు. ఫేస్‌బుక్‌లో చూసిన కారు, వ్యక్తిని ఆకాష్ స్నేహితుడు ఒకరు గుర్తుపట్టారు. వెంటనే ఆకాష్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆకాష్ వెంటనే దేవస్ ఏరియాకు వెళ్లాడు. ఆ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును ఆకాష్‌కు అప్పగించారు.  

Updated Date - 2022-01-27T18:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising