ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లీటర్ పెట్రోల్ ఫ్రీ.. నిమ్మకాయలు కూడా ఫ్రీ.. కానీ షరతులు ఏంటంటే..

ABN, First Publish Date - 2022-04-21T22:45:01+05:30

ఓ మొబైల్ షాప్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దుకాణంలో మొబైల్ లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తే పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు నిమ్మకాయలను కూడా ఉచితంగా పొందొచ్చని ప్రకటన వి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ మొబైల్ షాప్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దుకాణంలో మొబైల్ లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తే పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు నిమ్మకాయలను కూడా ఉచితంగా పొందొచ్చని ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్టర్ల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సమాజంలో చోటు చేసుకునే పరిణామాలను అనుకూలంగా మార్చుకుని లాభం పొందడం వ్యాపార లక్షణం. ఇందులో భాగంగానే ఓ మొబైల్ షాపు యజమాని వినూత్నంగా ఆలోచించాడు. తెలివిగా కస్టమర్ల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. పెట్రోల్, డీజిల్ రేట్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో నిమ్మకాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారణాసికి చెందిన ఓ మొబైల్ షాపు ఓనర్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తన దుకాణంలో రూ.10వేల విలువైన మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే.. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ ఫ్రీ అంటూ ప్రకటన విడుదల చేశాడు. 



అంతేకాకుండా రూ. 100విలువైన మొబైల్ యాక్సెసరీస్ కొనుగోలు చేస్తే రెండు నిమ్మకాయలను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటనలో పేర్కొన్నాడు. దీంతో అతడి షాపునకు కస్టమర్లు పోటెత్తుతున్నారు. తన ఐడియా ఫలించడంపట్ల సదరు యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కస్టమర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఆ యజమాని పేర్కొన్నాడు. కాగా.. ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-04-21T22:45:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising