ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral: వినూత్న ఆలోచన.. కేక్ మీద బయోడేటా ప్రింట్ చేసి Nike సంస్థకు పంపిన మహిళ..

ABN, First Publish Date - 2022-09-27T01:08:05+05:30

మంచి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచి సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తమ బయోడేటా లేదా రెజ్యూమ్‌లను (resume) ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు ఆపసోపాలు పడుతుంటారు. అయినా అవి కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ల వరకు వెళతాయంటే చెప్పలేం. అందుకే నార్త్ కరోలినాకు చెందిన కార్లీ బ్లాక్‌బర్న్ అనే మహిళ వినూత్నంగా ఆలోచించింది. 


ఇది కూడా చదవండి..

Shocking video: ఆకాశంలో ఢీకొట్టుకుని నేలరాలిన రెండు విమానాలు.. ఆ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..


తను దరఖాస్తు చేయాలనుకుంటున్న Nike సంస్థ హెడ్ క్వార్టర్‌లో పార్టీ జరుగుతున్నట్టు తెలుసుకుని ఆ పార్టీకి ఓ కేక్ పంపించింది. ఆ కేక్‌పై తన బయోడేటాను ప్రింట్ చేయించింది. `ఆ సంస్థ ప్రస్తుతం ఎలాంటి నియామకాలూ చేపట్టడం లేదు. దీంతో, నా గురించి వారికి చెప్పడానికి ఓ కొత్త మార్గాన్ని కనుగొనాలని నేను నిర్ణయించుకున్నాను. సంస్థ హెడ్ క్వార్టర్‌లో జరుగుతున్న పెద్ద పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏమిటి` అని కార్లీ పేర్కొంది. స్టాండర్డ్ జాబ్ అప్లికేషన్‌ను సమర్పించడం కంటే కేక్ పైన తన రెజ్యూమ్‌ని ప్రింట్ చేసి, ఒరెగాన్‌లోని నైక్ వరల్డ్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపడం ఉత్తమమని కార్లీ నిర్ణయించుకుంది. 


కాగా, కార్లీ తన చేసిన పని గురించి లింక్డ్‌ఇన్ ద్వారా అందరికీ తెలియజేసింది. ఆమె ఆలోచన పట్ల సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమె ఆలోచనను మెచ్చుకున్నారు. అది `అద్భుతమైన కాన్సెప్ట్` అన్నారు. మరికొందరు మాత్రం ఆమె ఆలోచనను `జిమ్మిక్`గా తీసిపారేశారు.  

Updated Date - 2022-09-27T01:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising