ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: మూడు ఫైర్ కొరడాలను.. కళ్లు చెదిరేలా గింగిరాలు కొట్టించి.. ప్రపంచ రికార్డు కొట్టిన ఘనుడు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

ABN, First Publish Date - 2022-07-01T21:34:15+05:30

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరే అంత వరకు చేరుకోగలుగుతారు. వివిధ విభాగాల్లో ఎంతో మంది అద్భత విన్యాసాలు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరే అంత వరకు చేరుకోగలుగుతారు. వివిధ విభాగాల్లో ఎంతో మంది అద్భత విన్యాసాలు చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంటుంటారు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వ్యక్తి.. భగ భగ మండుతున్న మూడు కొరడాలను అత్యంత వేగంగా గాలిలో గింగిరాలు కొట్టించాడు. చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉండే అతడి విన్యాసం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్.. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది..


యునైటెడ్ స్టేట్స్‌కి చెందిన ఆరోన్ బాంక్ అనే వ్యక్తి.. న్యూయార్క్‌లోని టక్సేడో పార్క్‌లో ఈ స్టంట్ చేశాడు. ముందుగా అతను మూడు కొరడాలకు నిప్పు అంటిస్తాడు. తర్వాత వాటిని ఒకదాని తర్వాత ఒకటిగా గాలిలోకి ఎగరేస్తాడు. తర్వాత మూడింటిని మార్చి మార్చి పట్టుకుంటూ రౌండ్ షేప్‌లో అత్యంత వేగంగా గింగిరాలు తిప్పుతాడు. ఓ వైపు పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నా.. ఏమాత్రం అదుపు తప్పకుండా అతడు వాటిని గాలిలో తిప్పిన విధానం.. అందరినీ ఆకట్టుకుంది. ఒక నిముషంలో 82 సార్లు గాలిలో తిప్పి.. గిన్నిస్ రికార్డు సాధించాడు. ఈ వీడియోను.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియో.. 37,900 పైగా వ్యూస్, 2,300 కంటే ఎక్కువ లైక్‌లను సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.. 

వావ్! ఈ బుడ్డోడి టాలెంటే వేరు.. ఎంత బాగా మ్యాజిక్ చేశాడో చూడండి..





Updated Date - 2022-07-01T21:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising