ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hiding Religion:ముస్లిం యువకుడి మోసం...మతాన్ని దాచిపెట్టి హిందూ మహిళతో సహజీవనం

ABN, First Publish Date - 2022-07-19T18:15:11+05:30

ఓ ముస్లిం యువకుడు హిందూ మహిళను మోసగించిన ఉదంతం యూపీలో తాజాగా వెలుగుచూసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్):ఓ ముస్లిం(Muslim) యువకుడు హిందూ మహిళను మోసగించిన(cheated) ఉదంతం యూపీలో తాజాగా వెలుగుచూసింది. ఓ ముస్లిం వ్యక్తి తన మతాన్ని దాచిపెట్టి(Hiding Religion) తనతో నెలల తరబడిగా సహ జీవనం చేస్తున్నాడని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ హిందూ మహిళ(hindu Woman) పోలీసులకు ఫిర్యాదు(police complaint) చేసింది. తాను 10 నెలల క్రితం గుడ్డు అనే వ్యక్తితో కలిసి జీవించడం ప్రారంభించానని, ఆ సమయంలో అతను తనకు చెప్పకుండా తన కుమారుడికి కూడా సున్తీ చేయించాడని బాధితురాలైన పింకీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.గుడ్డు అనే ముస్లిం యువకుడు తనను పెళ్లి చేసుకోకుండా నెలల తరబడిగా తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, అతడు ముస్లిం అనే విషయాన్ని దాచిపెట్టాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు.ఫిర్యాదుదారు పింకీ, ఆమె మూడేళ్ల కొడుకును ఆమె భర్త కొంతకాలం క్రితం విడిచిపెట్టాడని పోలీసులు తెలిపారు.


గుడ్డు తనను బరేలీ నగరానికి తీసుకెళ్లాడని, అక్కడ 6-7 నెలలపాటు అతను ముస్లిం అని తెలియక అతనితో కలిసి నివసించానని పింకీ చెప్పింది.బరేలీలో కొన్ని రోజుల తర్వాత గుడ్డు తనను తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ అతను ముస్లిం అని, అతని పేరు రహమత్ హసన్ అని తెలుసుకున్నానని బాధిత మహిళ పింకీ చెప్పారు. ‘‘నన్ను అతను, అతని కుటుంబ సభ్యులు చాలాసార్లు కొట్టారు. అతను నాతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. నేను కలిసి ఉన్న సమయంలో నా కొడుకుకు కూడా సున్తీ చేయించాడు’’ అని పింకీ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.


జులై 10వతేదీన ఎలాగోలా అతని ఇంటి నుంచి తప్పించుకుని ఘజియాబాద్‌కు తిరిగి వచ్చానని, అప్పుడు కూడా హసన్ తనను విడిచిపెట్టేందుకు సిద్ధంగా లేడని పోలీసులకు పింకీ తెలిపారు.ముస్లిం యువకుడైన రహమత్ హసన్ పింకీని వివాహం చేసుకోలేదని, అబద్ధాలతో ఆమెను మోసం చేశాడని,అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Updated Date - 2022-07-19T18:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising