ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: కోటీశ్వరుడిగా కొద్ది గంటలు.. కూలీ ఖాతాలో రూ.2700 కోట్లు.. సంతోషంతో బ్యాంకుకు వెళితే..

ABN, First Publish Date - 2022-08-03T20:55:55+05:30

ఉన్నట్టుండి ఒక్క క్షణంలోనే కోటీశ్వరుడిగా మారిపోతే..? కష్టపడకుండా కొన్ని కోట్ల రూపాయల అకౌంట్లో వచ్చి పడితే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నట్టుండి ఒక్క క్షణంలోనే కోటీశ్వరుడిగా మారిపోతే..? కష్టపడకుండా కొన్ని కోట్ల రూపాయల అకౌంట్లో వచ్చి పడితే..? ఆ వ్యక్తి సంతోషానికి అవధులే ఉండవు. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన ఓ దినసరి కూలీకి (Uttar Pradesh Labourer) అలాంటి పరిస్థితే ఎదురైంది. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొద్ది గంటల్లోనే ఆ ఆనందం కాస్తా ఆవిరైంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూపీలోని  కన్నౌజ్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల బిహారీ లాల్‌ ఇటుక బట్టీలో కూలీగా పనిచేస్తున్నాడు. 



ఇది కూడా చదవండి..

Justice after 28 years: అత్యాచార బాధితురాలికి 28 ఏళ్ల తర్వాత న్యాయం.. కోర్టు చుట్టూ తిరిగి తల్లికి న్యాయం చేసిన కొడుకు..


తన జన్‌‌ధన్‌ ఖాతా నుంచి రూ. 100 విత్‌డ్రా చేయడానికి ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. ఏటీఎమ్ నుంచి వంద రూపాయలు తీసిన తరువాత అతని మొబైల్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది. ఇంకా అకౌంట్‌లో బ్యాలెన్స్ రూ. 2,700 కోట్లు ఉన్నట్లు చూపించింది. కలలో కూడా ఊహించని మొత్తం తన అకౌంట్‌లో ఉన్నట్టు తెలుసుకుని లాల్ నివ్వెరపోయాడు. ఏటీఎమ్ సెంటర్‌లోనే అకౌంట్ స్టేట్‌మెంట్ తీశాడు. అందులోనూ అకౌంట్ బ్యాలెన్స్ రూ.2700 కోట్లు అనే చూపించింది. బీహారీ లాల్ వెంటనే ఎంతో సంతోషంతో బ్యాంక్‌కు వెళ్లాడు. 


అక్కడకు వెళ్లాక అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నాడు. బ్యాంక్‌లో అతని అకౌంట్ వివరాలు చూడగా బ్యాలెన్స్ కేవలం రూ.126 ఉన్నట్లు చూపించింది. దీంతో లాల్ తనకు వచ్చిన మెసేజ్, స్టేట్‌మెంట్ బ్యాంకు అధికారులకు చూపించాడు. అయితే సాంకేతిక లోపం వల్ల అలా ప్రింట్ అయ్యి ఉంటుందని, అకౌంట్‌లో రూ.200 కూడా లేవని చెప్పడంతో లాల్ నిరాశగా వెనుదిరిగాడు.  

Updated Date - 2022-08-03T20:55:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising