ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూనివర్సిటీలో యువకుడిని ప్రేమించిన యువతి.. ఒక్కసారిగా ప్రియుడు కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు.. అతనెక్కడున్నాడంటే..

ABN, First Publish Date - 2022-02-09T05:44:09+05:30

యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించే ఒక యువకుడు అదే విశ్వవిద్యాలయంలో చదివే ఒక విద్యార్థినికి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. దీంతో తరుచూ కలుసుకునేవారు. అలా వారిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించే ఒక యువకుడు అదే విశ్వవిద్యాలయంలో చదివే ఒక విద్యార్థినికి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉండేవారు. దీంతో తరుచూ కలుసుకునేవారు. అలా వారిద్దరి మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఆ యువకుడు ఒక అద్దె ఇంట్లో ఉండేవాడు. ఆ యువతి అతని ఇంటికి తరుచూ వచ్చేది. అలా వారిద్దరూ శారీరకంగా కూడా కలుసుకున్నారు. కొన్ని రోజుల తరువాత ఆ యువకుడు ఒక్కసారిగా కనబడకుండా పోయాడు. 


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంల బిలాస్ పూర్‌లోని ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య చదువుకునే అభిషేక్ త్రిపాఠీ(21) అనే యువకుడు అదే యూనివర్సిటీలో చదివే ఒక విద్యార్థిని జ్యోతి(పేరు మార్చబడినది)కి పరిచయమయ్యాడు. ఇద్దరూ ఒకే ప్రాంతంలో ఉంటూ తరుచూ కలుకునేవారు. అలా వారిద్దరూ దెగ్గరయ్యారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేకపోయేవారు. ఒకరోజు అభిషేక్ జ్యోతికి తన మనసులో మాట చెప్పాడు. ఆమె కూడా అతడిని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. ఆ తరువాత కొన్ని రోజులకు జ్యోతి గర్భవతి అయింది. దీంతో ఇక తనను పెళ్లి చేసుకోవాలని అభిషేక్‌తో చెప్పింది. కానీ అభిషేక్ అందుకు ఒప్పుకోలేదు. 


పెళ్లి చేసుకుంటే కెరీర్ నాశనం అవుతుందని ఆమెకు నచ్చజెప్పి అబార్షన్ చేయించాడు. కానీ జ్యోతి ఇకనైనా తనను పెళ్లిచేసుకోవాలని చెప్పింది. అందుకు అభిషేక్ మాటదాటేసేవాడు. ఒకరోజు జ్యోతి.. అభిషేక్‌ని ఈ విషయంలో నిలదీసింది. అభిషేక్ ఇక పెళ్లిచేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు. ఆ తరువాత ఆమెను కలవడం కూడా మానేశాడు. ఫోన్ చేస్తే కట్ చేసేవాడు.. ఆ తరువాత కనబడకుండా పోయాడు.


అభిషేక్ తనను మోసం చేశాడని గ్రహించిన జ్యోతి పోలీసులకు అతనిపై ఫిర్యాదు చేసింది. తనను ప్రేమిస్తున్నట్లు నటించి.. గర్భవతి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు పరారీలో ఉన్న అభిషేక్ ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేసి అతడిని పట్టుకున్నారు. అప్పటికి అభిషేక్ ఉత్తర్ ప్రదేశ్ పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడు.


ప్రస్తుతం పోలీసులు అభిషేక్‌పై అత్యాచారం, చీటింగ్ కేసు నమోదు చేశారు.


Updated Date - 2022-02-09T05:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising