ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Russian వైమానిక దాడి మధ్య ఉక్రేనియన్ జంట వివాహం

ABN, First Publish Date - 2022-02-26T14:18:38+05:30

సైనిక బాంబుల దాడి మోత...వైమానిక దాడులు...మోగుతున్న సైరన్ల మధ్య ఉక్రెయిన్ దేశంలోని కీవ్ నగరంలోని చర్చ్‌‌లో ఓ జంట వివాహం చేసుకుంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంపై రష్యా భీకర దాడి జరుగుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సైనిక బాంబుల దాడి మోత...వైమానిక దాడులు...మోగుతున్న సైరన్ల మధ్య ఉక్రెయిన్ దేశంలోని కీవ్ నగరంలోని చర్చ్‌‌లో ఓ జంట  వివాహం చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి కొనసాగుతున్నా, వధూవరులు యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ లు చర్చ్ లో వివాహం చేసుకున్నారు.రష్యా దళాలు సాగిస్తున్న వైమానిక దాడులు, బాంబుల దాడులతో కీవ్ నగరంలో దట్టమైన పొగ వ్యాపించినా కొత్త జంట మాత్రం చర్చ్ లో వివాహం చేసుకున్నారు. రష్యా సేనల దాడితో పరిస్థితి భయానకంగా ఉన్నా తాము తమ భూమి కోసం పోరాడుతున్నామని వరుడు అరివా చెప్పారు.


‘‘ యుద్ధం వల్ల బహుశా మేం చనిపోవచ్చు, కాని మేమిద్దరం అన్నింటికీ ముందు కలిసి ఉండాలనుకుంటున్నాం.’’ అని క్షిపణి దాడుల మధ్యలో చర్చిలో చేసుకున్న వివాహం గురించి యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ లు చెప్పారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ జంట చర్చ్‌లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు.


Updated Date - 2022-02-26T14:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising