ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UFOs: ఉక్రెయిన్‌లో గుంపులుగుంపులుగా యూఎఫ్‌వోలు.. ఖగోళశాస్త్రవేత్తల సంచలన ప్రకటన

ABN, First Publish Date - 2022-09-17T03:38:30+05:30

ఖగోళశాస్త్రవేత్తలకు అంతుచిక్కని యూఎఫ్‌వోలు (Unidentified Flying Objects) మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఖగోళశాస్త్రవేత్తలకు అంతుచిక్కని యూఎఫ్‌వోలు (Unidentified Flying Objects) మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఉక్రెయిన్‌లోని కీవ్ నగర ఆకాశంలో యూఎఫ్‌వోలను(UFOs) గుర్తించామని ఆ దేశ ఖగోళశాస్త్రవేత్తలు(Astronomers) చెబుతున్నారు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ వార్తని ‘మెయిన్ అస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆఫ్ ఉక్రెయిన్’ పబ్లిష్ చేసింది. ‘‘అన్‌ఐడెంటిఫైడ్ ఏరియా ఫినోమినా అబ్జర్వేషన్స్ ఆఫ్ ఈవెంట్స్’ టైటిల్‌తో ఈ వార్తను ప్రచురించింది. కీవ్ నగరంతోపాటు సమీపంలోని వినరివ్‌కా గ్రామానికి సమీపంలోని యూఎఫ్‌వోలు ఎగురుతున్నట్టు రెండు ఉల్కాపాత అబ్జర్వేషన్ స్టేషన్లు గుర్తించాయని ఉక్రెయిన్ శాస్త్రవేత్తలు తెలిపారు.


అయితే ఈ వాదనలను యూఎస్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు కొట్టివేస్తున్నాయి. ఎగురుతున్న ఈ వస్తువులు చాలా వేగంగా ప్రయాణిస్తుండడంతో వీటిని గుర్తించడం చాలా సంక్లిష్టమని, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వినియోగిస్తున్న విమానాలు, డ్రోన్లుగా భావించవచ్చునని యూఎస్ ఇంటెలిజెన్సీ ఏజెన్సీలు చెబుతున్నాయి.





‘‘ ప్రతిచోటా ఇలాంటివి చూస్తున్నాం. మేము గుర్తించిన వస్తువుల సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే అవి ఏంటనేది ఇంకా తెలియరాలేదు’’ అని ఉక్రెయిన్ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. ఒక్కొక్కటిగా, గుంపులు, సమూహాల షిప్స్‌ను గుర్తించామని, ఒక్కో సెకన్‌కి 3-15 డిగ్రీల వేగంగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు.


కాగా ఇలాంటి యూఎఫ్‌వోలను కాస్మిక్, ఫాంథమ్ అనే 2 కేటగిరీలుగా విభజిస్తున్నట్టు ఉక్రెయిన్ ఖగోళ  శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కాస్మిక్ యూఎఫ్‌వోలు ప్రకాశవంతంగా మెరిసిపోతుంటాయని, అయితే ఇందుకు విరుద్ధంగా ఫాంథమ్ యూఎఫ్‌వోలు కాంతిని శోషించుకుని, కంటికి కనిపించకుండా ఉంటాయని చెప్పారు. వీటిని గుర్తించడం కొంతకష్టమేనని చెప్పారు. అసాధారణ ఫొటోలు, వీడియో రికార్డింగులు ఈ యూఎఫ్‌వోలను గుర్తించలేవని చెప్పారు. వీటిని గుర్తించేందుకు తగిన పరికరాలు ఉండాలన్నారు. స్పీడ్, ఫ్రేమ్ రేటు, డైనమిక్ తగిన రీతిలో ఉండాలని పేర్కొన్నారు. అయితే గత 7 నెలలుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని ఖగోళశాస్త్రవేత్తలు ప్రస్తావించలేదు.

Updated Date - 2022-09-17T03:38:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising