ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nike Shoesపై ఉన్న పిచ్చితో.. ఓ వ్యక్తి షాకింగ్ నిర్ణయం.. అతడు చేసిన పనికి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2022-06-17T22:51:48+05:30

సాధారణంగా కొందరు బ్రాండెడ్ దస్తులు, షూలు, వస్తువులపై అమితమైన ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తూ సంతోష పడుతుంటారు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తికి నైక్ బూట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. మార్కెట్‌లోకి కొ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా కొందరు బ్రాండెడ్ దస్తులు, షూలు, వస్తువులపై అమితమైన ఇష్టాన్ని కనబరుస్తూ ఉంటారు. మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తూ సంతోష పడుతుంటారు. ఈ కోవకే చెందిన ఓ వ్యక్తికి నైక్ బూట్లు అంటే చెప్పలేనంత ఇష్టం. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన బూట్లను కొనుగోలు చేసేవాడు. అయితే నెలల వ్యవధిలోనే మరిన్ని కొత్త కొత్త స్టైల్స్‌లో బూట్లు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు చేసిన పనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తికి నైక్ బ్రాండెడ్ బూట్లంటే చాలా ఇష్టం. వాటిపై ఉన్న మక్కువతో కొత్త కొత్త స్టైల్స్‌లో షూలు మార్కెట్‌లోకి విడుదలైన వెంటనే వాటిని కొనుగోలు చేసేవాడు. అయితే.. అతడు కొనుగోలు చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే మరికొన్ని కొత్త వేరియంట్ షూలు మార్కెట్‌లోకి విడుదల అవుతుండటంతో ఆర్థిక ఇబ్బుందులను సైతం పట్టించుకోకుండా వాటిని కూడా ఇంటికి తెచ్చేసుకునేవాడు. ఈ క్రమంలోనే విసిగిపోయిన అతడు.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. నైక్‌ షూ వేసుకున్నాననే భావన పొందేందుకు.. అచ్చం అదే స్టైల్లో తన కాళ్లకు టాటూలు వేయించుకోవాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే యూకేలోని ప్రముఖ టాటూ ఆర్టిస్ట్ డీన్ గున్థర్‌ను సంప్రదించాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాధను అర్థం చేసుకున్న ఆయన.. దాదాపు 8 గంటలపాటు శ్రమించి అతడి కాళ్లపై టాటూలు వేశాడు. అనంతరం అందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లో ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు.. ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-06-17T22:51:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising