Flight మిస్సింగ్ కంప్లైంట్‌పై 4 ఏళ్ల తర్వాత Uberకు కోర్టు షాక్!
ABN, First Publish Date - 2022-10-27T13:41:47+05:30
ఆమె ఒక లాయర్. అర్జెంట్ పని మీద చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. అనంతరం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఉబెర్‌ను బుక్ చేసుకుంది. అయితే..
ఇంటర్నెట్ డెస్క్: ఆమె ఒక లాయర్. అర్జెంట్ పని మీద చెన్నై వెళ్లేందుకు ఫ్లైట్ బుక్ చేసుకుంది. అనంతరం ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు ఊబెర్‌ను బుక్ చేసుకుంది. అయితే.. ఆమె ఫ్లైట్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. తాజాగా తీర్పు వెల్లడించిన కోర్టు.. ఊబెర్‌కు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
ముంబైకి చెందిన అడ్వకేట్ కవితా శర్మా.. 2018 జూన్ 12న చెన్నై వెళ్లేందుకు ముందుగానే ఫ్లైట్ టికెట్‌ను బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఏడాది జూన్ 12న మధ్యాహ్నం 3.29 గంటలకు 36 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి ఊబెర్‌ను బుక్ చేసుకున్నారు. అయితే.. ట్యాక్సీ మాత్రం ఆమెను పికప్ చేసుకోవడానికి అంత త్వరగా రాలేదు. దీంతో డ్రైవర్‌కు ఆమె పదుల సంఖ్యలో ఫోన్లు చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 15 నిమిషాల తర్వాత కారుతో పాటు డ్రైవర్ ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా అతడు వెంటనే ఎయిర్ పోర్టుకు బయల్దేరలేదు. ఫోన్‌లో మాట్లాడుతూ.. ఆలస్యం చేశాడు. అనంతరం ఎట్టకేలకు కవితా శర్మను పికప్ చేసుకుని అక్కడ నుంచి ఎయిర్ పోర్టుకు బయల్దేరాడు. కానీ అతడు ఎయిర్ పోర్టుకు తిన్నగా వెళ్లకుండా.. మధ్యలో డైవర్షన్ తీసుకుని కారులో ఇంధనం నింపుకోవడం కోసం పెట్రోల్ స్టేషన్‌కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు వెళ్లే సరికి కవితా శర్మా ఫ్లైట్ మిస్ అయింది.
ఇదిలా ఉంటే.. ట్యాక్సీ బుక్ చేసుకున్న సమయంలో ఛార్జీ రూ.563 చూపించగా.. ఎయిర్ పోర్టుకు చేరిన తర్వాత అది కాస్తా రూ.703 చేరినట్టు యాప్‌లో చూపించింది. అయితే తప్పని పరిస్థితుల్లో ఆమె ఆ మొత్తాన్ని చెల్లాంచారు. అనంతరం ఊబెర్ ప్రతినిధులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. కానీ ఉబెర్ కేవలం రూ.139 రీఫండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊబెర్‌కు లీగల్ నోటీసులు పంపించారు. అయినా వాళ్ల నుంచి స్పందన రాకపోవడంతో.. వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుమారు నాలుగేళ్లపాటు విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. ఫ్లైట్ విషయం గురించి ఆమె అనుభవించిన మెంటల్ టెన్షన్, అధిక ఛార్జీ వసూలు చేసిన నేరానికిగానూ కవితా శర్మకు పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఊబెర్‌ను ఆదేశించింది.
Updated Date - 2022-10-27T14:15:41+05:30 IST