ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking: పాముపై ప్రతీకారం తీర్చుకున్న రెండేళ్ల బాలిక.. తనను కాటేసిన పామును పట్టుకుని నోటితో..

ABN, First Publish Date - 2022-08-16T02:52:32+05:30

సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయని వింటూ ఉంటాం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణంగా పాములు మనుషులపై పగ తీర్చుకుంటాయని వింటూ ఉంటాం. చాలా సినిమాల్లో చూశాం. అయితే ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ (girl kills snake in revenge) తీర్చుకున్న ఘటన టర్కీలో జరిగింది. అవును.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ పామును రెండేళ్ల చిన్నారి నోటితో కొరికి ముక్కలు ముక్కలు చేసింది. టర్కీ (Turkey)లోని కంతార్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇది కూడా చదవండి..

Love with prisoner: జైలులో ఉన్న ఖైదీతో ప్రేమలో పడిన మహిళ.. చివరకు..


ఎస్‌ఈ అనే పేరు గల చిన్నారి తన ఇంటి వెనకాల పెరటిలో ఆడుకుంటోంది. కొద్ది సేపటి తర్వాత పెద్దగా అరిచింది. కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు వెంటనే అక్కడకు వెళ్లి చూసి షాకయ్యారు. ఎందుకంటే ఆ పాప నోట్లో పాము (Snake) ఉంది.  చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. చిన్నారిని వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. 


`మా పాప ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. ఆ కోపంతో మా పాప ఆ పామును కొరికేసింది. మేం వెళ్లి చూసేటప్పటికి పాప నోట్లో పాము ఉంద`ని పాప తండ్రి మెహ్మెట్‌ ఎర్కాన్‌ చెప్పారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral News) మారింది. 

Updated Date - 2022-08-16T02:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising