ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేవలం రూ.60 కోసం మహిళ ప్రాణాలు తీసిన కిరాతకులు.. అసలు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-01-20T06:08:32+05:30

మద్యం తాగి డబ్బులు చెల్లించకుండా ఇద్దరు వ్యక్తులు గొడవ చేశారు. ఆ గొడవలో మద్యం కొట్టు యజమాని అయిన ఒక మహిళను ఆ ఇద్దరూ కిరాతకంగా హత్య చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్యం తాగి డబ్బులు చెల్లించకుండా ఇద్దరు వ్యక్తులు గొడవ చేశారు. ఆ గొడవలో మద్యం కొట్టు యజమాని అయిన ఒక మహిళను ఆ ఇద్దరూ కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బలరామ్‌పూర్ జిల్లాలో జరిగింది.


పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్‌లోని బలరామ్‌పూర్ జిల్లా పరిధి పోడిఖర్దా గ్రామానికి చెందిన పార్థీ అనే యువతి తన తల్లి ఛాందిని దేవిని ఎవరో హత్య చేసి పొలంలో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఛాందిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఛాందిని దేవి(42) గొంతుకు తాడు బిగించి ఆమెను హత్య చేశారు.  పోలీసులు ఛాందిని హత్య కేసు విచారణ చేసి ఒక యువకుడిపై అనుమానంతో అరెస్టు చేశారు. అతడిని పోలీసులు గట్టిగా ప్రశ్నించగా ఛాందిని దేవిని తన మిత్రుడితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించాడు. 


అసలేం జరిగిందంటే..

పోలీసుల కథనం ప్రకారం.. పోడిఖర్దా గ్రామంలో మద్యం కొట్టు నిర్వహిస్తున్న ఛాందిని దేవి వద్ద చందు, రాజ్ కుమార్ అనే యువకులు మద్యం తాగి డబ్బులు చెల్లించకుండా పోయారు. కొన్ని రోజుల తరువాత మరోసారి మద్యం కోసం చందు, రాజ్ కుమార్ ఛాందిని దేవి కొట్టుకు వచ్చారు. కానీ ఈ సారి ఛాందిన దేవి మద్యం ఇవ్వలేదు. ఇంతకుముందు తాగిని మద్యం బకాయి రూ.60 ముందు చెల్లిస్తేనే ఇప్పుడు మద్యం ఇస్తానని చెప్పింది. దీంతో చందు, రాజ్ కుమార్ వెనుతిరిగారు. కానీ ఛాందిని దేవి వారిని బకాయి చెల్లించమని ఆ తరువాత వెళ్లమని గట్టిగా అడిగింది. ఫలితంగా గొడవ మొదలైంది.. ఆ గొడవలో ఛాందిని దేవి వారిని దారుణంగా బూతులతో తిట్టిందని.. అందువల్ల కోపంలో చందు, రాజ్ కుమార్ ఆమెను తాడుతో ఉరి బిగించి హత్య చేశారు.  హత్య చేసిన తరువాత ఛాందిని శవాన్ని గ్రామంలోని ఒక పొలంలో పడేశారు. 


ఛాందిని దేవి హత్య కేసులో పోలీసులు చందుని అరెస్టు చేయగా.. మరో నిందితుడు రాజ్ కుమార్ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2022-01-20T06:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising