ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యల నుంచి విముక్తి పొందారట.. విడాకుల మహోత్సవం చేసుకుంటారట.. 200 మంది మగాళ్ల ఏర్పాట్లు.. చివరకు..

ABN, First Publish Date - 2022-09-13T02:35:57+05:30

శ్రీకాంత్, రమ్యక్రిష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో మరో యువతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో.. రమ్యక్రిష్ణను శ్రీకాంత్ విడాకులు అడుగుతాడు. అందుకు అంగీకరించిన ఆమె.. వేద మంత్రాల నడుమ వివాహం జరిగినందువల్ల అదే పద్ధతిలో విడాకులు ఇస్తానని రమ్యక్రిష్ణ చెబుతుంది. అందులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: శ్రీకాంత్, రమ్యక్రిష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘ఆహ్వానం’ సినిమా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో మరో యువతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో.. రమ్యక్రిష్ణను శ్రీకాంత్ విడాకులు అడుగుతాడు. అందుకు అంగీకరించిన ఆమె.. వేద మంత్రాల నడుమ వివాహం జరిగినందువల్ల అదే పద్ధతిలో విడాకులు ఇస్తానని రమ్యక్రిష్ణ చెబుతుంది. అందులో భాగంగానే విడాకుల మహోత్సవానికి రావాలంటూ ఆహ్వాన పత్రికలు కూడా పంచుతుంది. ఇప్పుడు ఈ సినిమాను ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే.. ఇంచుమించు ఇటువంటి ఏర్పాట్లే ఓ దగ్గర చోటు జరిగాయి. కానీ ఇక్కడ వివాహ మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఏర్పట్లు చేసుకుంది మాత్రం పురుషులు. సుమారు 200 మంది మగవాళ్లు.. ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. చివరికి కథ అడ్డం తిరిగింది. దీంతో ఈ ఘటన హాట్ టాపిక్‎గా మారింది. ఇంతకూ విషయం ఏంటంటే..



మధ్యప్రదేశ్(Madhya Pradesh)‎కు చెందిన సుమారు 200 మంది మగవాళ్లు.. పలు కారణాల వల్ల తమ వివాహ జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే భార్యలకు విడాకులు(divorced) ఇచ్చేశారు. భార్యల నుంచి విముక్తి పొందినట్టు భావించిన ఆ మగ మహారాజులు.. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ‘భాయ్ వెల్ఫేర్ సొసైటీ’ ఆధ్వర్యంలో భోపాల్(Bhopal)‎లో ఈ నెల 18న పార్టీ చేసుకునేందకు ప్రణాళికలు రూపొందించారు. ఆహ్వాన పత్రికలు ప్రింట్ చేయించి మరీ.. ఈ కార్యక్రమానికి అతిథులను ఆహ్వానించారు. భార్య బాధితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు కూడా విడుదల చేశారు. అయితే.. దురదృష్టవశాత్తు వాళ్ల కథ అడ్డం తిరిగింది.  విషయం స్థానికంగా ఉన్న హిందూ సంస్థలకు తెలియడంతో.. ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయింది. హిందూ సంప్రదాయానికి విరుద్ధంగా ఇటువంటి వేడుకలు నిర్వహించకూడదని హిందుత్వ నాయకులు హెచ్చరించడంతో.. వెనక్కి తగ్గారు. దీంతో విషయం స్థానికంగా హాట్ టాపిక్‎గా మారింది.


Updated Date - 2022-09-13T02:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising