ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంగేజ్‌మెంట్ అయ్యాక రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు.. వాళ్లు మళ్లీ తిరిగి ఎలా కలిశారంటే..

ABN, First Publish Date - 2022-03-07T19:39:15+05:30

వారిద్దరికీ పెళ్లి కుదిరింది.. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది.. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరికీ పెళ్లి కుదిరింది.. అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది.. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.. ఆ సమయంలో ఇద్దరి కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తాయి.. అవి తీవ్ర రూపం దాల్చడంతో పెళ్లి రద్దైపోయింది.. అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్న వధూవరులు ఇళ్ల నుంచి పారిపోయారు.. పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి చివరకు పెద్దవాళ్లను కలిపారు. 


మధ్యప్రదేశ్‌లోని బింధ్‌కు చెందిన రాజేష్, మేఘ అనే యువతీయువకులకు ఐదు నెలల క్రితం ఎంగేజ్‌మెంట్ జరిగింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ పాటికి ఇద్దరికీ పెళ్లి అయిపోయేది. అయితే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ విషయం తెలుసుకుని రాజేష్, మేఘ షాకయ్యారు. అప్పటికే వారిద్దరూ తరచుగా మొబైల్స్‌లో మాట్లాడుకుంటూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. పెద్దవాళ్లను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించారు. 


వారు మనసు మార్చుకోరని నమ్మకం కుదరడంతో ఇద్దరూ కలిసి రాజస్థాన్ వెళ్లిపోయారు. దీంతో మేఘ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నెల రోజుల అనంతరం ఇద్దరినీ పట్టుకుని బింధ్‌కు తీసుకెళ్లారు. అయితే వారిద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు పెద్ద వారికి సర్ది చెప్పారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో దారికి వచ్చిన ఇరు కుటుంబ సభ్యులు రాజేష్, మేఘ పెళ్లికి అంగీకారం తెలిపారు. 

Updated Date - 2022-03-07T19:39:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising