ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాల కోసం ఆవులకు VR headsets.. ప్లాన్ సక్సెస్ కావడంతో ఎగిరి గంతేసిన యజమాని.. ఇంతకూ విషయం ఏంటంటే..

ABN, First Publish Date - 2022-01-10T13:34:06+05:30

ఉద్యోగం చేయడం కంటే వ్యాపారమే మేలను అతడు భావించాడు. ఈ క్రమంలోనే కొన్ని ఆవులతో డెయిరీ ఫార్మ్‌ను నెలకొల్పాడు. అప్పటి వరకూ పాలను బాగానే ఇచ్చిన ఆవులు.. అకస్మాత్తుగా తగ్గించేశాయి. ఆవులు పాలను తక్కువ ఎందుకు ఇస్తున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేయడం కంటే వ్యాపారమే మేలను అతడు భావించాడు. ఈ క్రమంలోనే కొన్ని ఆవులతో డెయిరీ ఫార్మ్‌ను నెలకొల్పాడు. అప్పటి వరకూ పాలను బాగానే ఇచ్చిన ఆవులు.. అకస్మాత్తుగా తగ్గించేశాయి. ఆవులు పాలను తక్కువ ఎందుకు ఇస్తున్నాయో అర్థం చేసుకున్న అతడు.. వాటికి వీఆర్ హెడ్‌సెట్‌లను అమర్చాడు. ప్లాన్ సక్సెస్ కావడంతో ఎగిరి గంతేశాడు. పాల ఉత్పత్తి పెరిగిందని ఆనందం వ్యక్తం చేశాడు. కాగా.. వీఆర్ హెడ్‌సెట్‌లకు పాల ఉత్పత్తి పెరగడానికి మధ్య ఉన్న సంబంధం ఏంటనే విషయాన్ని పరిశీలిస్తే..



టర్కీకి చెందిన ఓ వ్యక్తికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. వ్యాపారం ద్వారా చేయడమే మేలని భావించాడు. ఇందులో భాగంగానే కొన్ని ఆవులతో డెయిరీ ఫార్మ్‌ను నెలకొల్పాడు.  అప్పటి వరకూ ఆవులు పాలను బాగానే ఇచ్చాయి. అయితే.. శీతాకాలం మొదలవడంతోనే పాలు ఇవ్వడాన్ని తగ్గించేశాయి. దీంతో పాల ఉత్పత్తిని పెంచడానికి సదరు వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆవులకు వీఆర్ హెడ్‌సెట్ అమర్చాడు. ప్లాన్ సక్సెస్ అవడంతో.. సదరు వ్యాపారి ఎగిరి గంతేశాడు. పాల ఉత్పత్తి పెరిగిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్‌లు అమర్చడం ద్వారా ఫార్మ్‌లో కాకుండా బయట వాతావణంలో ఉన్నట్టు అవి భావించాయని తెలిపాడు. అంతేకాకుండా ప్రశాంతమైన మ్యూజిక్‌ను ప్లే చేయడం వల్ల ఆవులు ఆనందానికి లోనైనట్టు చెప్పారు. ఈ క్రమంలో గతంలో 22 లీటర్లపాలు ఇచ్చే ఆవు.. ప్రస్తుతం 27 లీటర్ల వరకూ ఇస్తుందని పేర్కొన్నాడు. దీంతో ఉత్పత్తి పెరిగినట్టు వెల్లడించారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 




Updated Date - 2022-01-10T13:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising