ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Breast cancer: ఆమె నిద్రిస్తే క్యాన్సర్ మేల్కొంటుంది.. శాస్త్రవేత్తల అధ్యయనంలో సంచలన విషయం వెల్లడి!

ABN, First Publish Date - 2022-06-27T01:00:26+05:30

రొమ్ము క్యాన్సర్‌పై(Breast Cancer) ఇటీవల జరిగిన అధ్యయనంలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యూరిచ్: రొమ్ము క్యాన్సర్‌పై(Breast Cancer) ఇటీవల జరిగిన అధ్యయనంలో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రోగులు నిద్రలో ఉన్నప్పుడు క్యాన్సర్ కణాలు..  కణితి(Tumor) నుంచి విడివడి ఇతర శరీర భాగాలకు మరింత ఎక్కువగా వ్యాపిస్తాయని(Metastasis) తేలింది. యూనివర్శిటీ ఆఫ్ బాసెల్‌లోని ఆస్పత్రికి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో ఈ అంశం బయటపడింది. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు తాజాగా నేచర్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  


సాధారణంగా క్యాన్సర్ వ్యాధిని తొలినాళ్లల్లోనే గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతారు. క్యాన్సర్ కణాలు ఇతర శరీర భాగాలకు వ్యాపించడం మొదలైతే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది.  వైద్యపరిభాషలో కణాల వ్యాప్తిని మెటాస్టాసిస్ అంటారు. ఈ క్రమంలో కణాలు ఇతర శరీర భాగాలకు చేరుకుని కొత్త కణితులుగా మారతాయి. ఇక.. శాస్త్రవేత్తలు ఎలుకల్లో క్యాన్సర్ సెల్స్ వ్యాప్తిని నిశితంగా పరిశీలించగా.. ఎలుకలు నిద్రిస్తున్న సమయాల్లోనే మెటాస్టాసిస్ అధికంగా జరుగుతున్నట్టు తేలింది. కణితుల నుంచి క్యాన్సర్ కణాలు నిత్యం విడుదలవుతుంటాయని శాస్త్రవేత్తలు ఇంతకాలం అనుకున్నారు. అయితే.. తాజా అధ్యయనంలో ఈ ప్రక్రియకు సంబంధించి ఓ కొత్త కోణం వెలుగులోకి తెచ్చింది. ఇక రొమ్ము క్యాన్సర్‌ లాగా ఇతర క్యాన్సర్ రకాల్లోనూ ఇలాగే జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. 



రాత్రి, పగలు సమయాల్లో జీవక్రియల స్థాయిలను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ దీనికి కారణమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూ రోగులకు చికిత్స అందిస్తే.. వారు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. 

Updated Date - 2022-06-27T01:00:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising