ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Accident Video: వేగంగా వస్తున్న లారీ.. బ్యాలెన్స్ కోల్పోయిన బైకర్.. వైరల్ అవుతున్న యాక్సిడెంట్ వీడియో!

ABN, First Publish Date - 2022-08-30T03:02:31+05:30

మహమ్మారి వ్యాధుల కంటే, భయంకర రోగాల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ మందిని బలిగొంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహమ్మారి వ్యాధుల కంటే, భయంకర రోగాల కంటే రోడ్డు ప్రమాదాలే ఎక్కువ మందిని బలిగొంటున్నాయి. రోడ్ల మీద గుంతల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ సేఫ్‌గా ఇంటికి చేరేవరకు కుటుంబ సభ్యులకు ఆందోళన తప్పడం లేదు. రోడ్డు మీద మృత్యువు ఏ వైపు నుంచి ఏ క్షణంలో తరుముకు వస్తోందో చెప్పలేం. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ వీడియో చూస్తే ఎవరికైనా ఒక్క క్షణం భయమేస్తుంది. 


మహారాష్ట్ర (Maharashtra)లోని థానే జిల్లాకు చెందిన గణేష్ ఫాలే(22) అనే వ్యక్తి ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డుపై విపరీతంగా గుంతలు వున్నాయి. అదే సమయంలో అటు వైపు నుంచి లారీ వస్తోంది. ఆ సమయంలో గణేష్  బ్యాలెన్స్ తప్పి లారీ వెనుక చక్రాల కిందపడిపోయాడు. లారీ గణేష్‌పై నుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు వైద్యులు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-08-30T03:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising