ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒంటరిగా వెళ్తున్న బాటసారులే ఆ ట్రాన్స్‌జెండర్ల టార్గెట్.. ఓ వ్యక్తిని అడవిలోకి లాక్కెళ్లి...

ABN, First Publish Date - 2022-01-23T03:15:47+05:30

పేరుకే ట్రాన్స్‌జెండర్స్ అయినా సమాజంలో సాటి మనుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంటారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చిన విషయం తెలిసిందే. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కొందరు

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేరుకే ట్రాన్స్‌జెండర్స్ అయినా సమాజంలో సాటి మనుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుంటారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు కూడా తెచ్చిన విషయం తెలిసిందే. వారికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కొందరు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకుంటూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఢిల్లీలో కొందరు ట్రాన్స్‌జెండర్స్ చేసిన పనులే ఇందుకు ఉదాహరణ. వారు పైకి మాత్రం మంచి వారిలా కనిపిస్తుంటారు. కానీ ఒంటరిగా వెళ్లే బాటసారులను చూస్తే మాత్రం తమ అసలు స్వరూపం బయటపెడతారు. అసలు ఏం జరిగిందంటే..


ఢిల్లీలోని సన్‌లైట్ కాలనీ యమునా ఖాదర్ వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఇంతలో రోషన్ అనే వ్యక్తి పరుగెత్తుకుంటూ వారి వద్దకు వచ్చాడు. కంగారు, భయంతో పోలీసుల వద్ద తన సమస్యను చెప్పుకొన్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. సమీపంలోని షాప్పోర్జీ లేబర్ క్యాంపునకు రోషన్ నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో నిర్మానుష్య ప్రదేశంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్ అతన్ని అడ్డుకున్నారు. బలవంతంగా సమీపంలోని అడవిలోకి లాక్కెళ్లారు. అక్కడ నోరు మూసి, చంపేస్తామని బెదిరించారు. తర్వాత అతని వద్ద ఉన్న రూ.4,500 నగదును తీసుకుని పారిపోయారు. ఈ విషయాన్ని రోషన్ తెలుపగానే.. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను వెంబడించారు. ఎట్టకేలకు ముగ్గురు ట్రాన్స్‌జెండర్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పశ్చిమ బెంగాల్‌కు చెందిన.. రూబీ (42), రాణి (30), రవినా (20)గా గుర్తించారు. గతంలో వీరిపై పలు దోపీడీ కేసులు నమోదైనట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..

Updated Date - 2022-01-23T03:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising