ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bali: ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ మృతి.. పోలీసులపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.. స్పందించని అధికారులు

ABN, First Publish Date - 2022-08-27T17:39:26+05:30

పోలీసుల అదుపులో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బాలీలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అధికారులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇంత వరకూ ఆరోపణలపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: పోలీసుల అదుపులో ఉన్న ఓ ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన బాలీలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు అధికారులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇంత వరకూ ఆరోపణలపై స్పందించలేదు. కాగా.. ఇంతకూ ఆ యాక్టివిస్ట్‌ను బాలీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల ఆరోపణలు ఏంటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..



పెరూ దేశానికి చెందిన రొడ్రిగో వెంటోసిల్లా ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్. గత కొన్నేళ్లుగా అతడు/ఆమె ట్రాన్స్‌జెండర్‌ల హక్కుల కోసం పోరాడుతున్నారు. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో గ్రాడ్యూయేషన్ చదువుతున్న రొడ్రిగోకు ప్రస్తుతం 32ఏళ్లు. తాజాగా సెబాస్టియన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అనంరతం ఇద్దరూ కలిసి హనీమూన్ కోసం ఈ నెల ఆరున బాలీకి వెళ్లారు. అయితే.. రొడ్రిగో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తూ ఎయిర్ పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అడ్డుకోబోయిన సెబాస్టియన్‌ కూడా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 9న రొడ్రిగో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి.. రొడ్రిగో మరణించారు. అవయవాల ఫెయిల్యూర్ కారణంగా మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. 


దీనిపై రొడ్రిగో కుటుంబ సభ్యులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జాత్యహంకరాం, ట్రాన్స్‌జెండర్లపై ఉన్న అసహ్యంతో కావాలనే రొడ్రిగోను అరెస్ట్ చేశారు’ అని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రొడ్రిగో దగ్గర పట్టుకున్నవి మాదక ద్రవ్యాలు కావని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం కోసం డాక్టర్లు రాసిచ్చిన మాత్రలను డ్రగ్స్‌ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా పోలీసులు తమ వద్ద డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. అయితే పోలీసులు మాత్రం.. దీనిపై స్పందించలేదు. 


Updated Date - 2022-08-27T17:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising