Viral Video: గుర్రాన్ని డొక్కలో తన్నిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2022-12-31T20:12:09+05:30
ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ చూపితే తప్ప జంతువులు మనుషుల మాట వినవు. జంతువులను మచ్చిక చేసుకునే క్రమంలో మనుషులు ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్నో శతాబ్దాలుగా మానవులు, జంతువుల మధ్య బంధం బలపడుతూ వస్తోంది. కుక్క, పిల్లి, గాడిద, గుర్రం, ఏనుగు వంటి జంతువులను మనుషులు మచ్చిక చేసుకుని వాటిని తమ పనులకు వినియోగించుకుంటున్నారు. గుర్రం, ఏనుగు వంటి జంతువులను ఉపయోగించుకుని భారీ యుద్ధాలు కూడా చేశారు. వాటిని ప్రయాణాలకు వాడుకున్నారు. అయితే వాటికి ఆయా పనులను నేర్పడం మాత్రం అంత సులభమైన పని కాదు.
ఎంతో ఓర్పు, సహనం, ప్రేమ చూపితే తప్ప జంతువులు మనుషుల మాట వినవు. జంతువులను మచ్చిక చేసుకునే క్రమంలో మనుషులు ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి.. గుర్రానికి (Horse) ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ క్రమంలో కాస్త దురుసుగా వ్యవహరించి దానిని డొక్కలో తన్నాడు. వెంటనే ఆ గుర్రం తన వెనుక కాలితో ఆ వ్యక్తిని కడుపులో తన్నేసింది. దీంతో ఆ వ్యక్తి కింద పడిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
Updated Date - 2022-12-31T20:12:11+05:30 IST