ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: బోనులో సింహమే కదా.. ఏం చేస్తుందిలే అనుకుని తమాషా చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి..

ABN, First Publish Date - 2022-02-13T03:08:07+05:30

తాజాగా సింహానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బోనులో ఉన్న సింహంతో ఓ వ్యక్తి పరాచికాలు ఆడతాడు. ఒక్కసారిగా దానికి తిక్క లేచి.. ఆ వ్యక్తికి చుక్కలు చూపిస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రూర మృగాలు అడవిలో ఉన్నప్పుడు వాటి జోలికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు. అయితే జూలో ఉన్న జంతువులతో కొందరు పరాచికాలు ఆడుతుంటారు. బోనులో ఉన్నాయి కదా.. ఏం చేస్తాయిలే అనుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వాటితో ఆటలాడి.. ప్రాణం మీదకు తెచ్చుకున్న వారిని చాలా మందిని చూశాం. తాజాగా సింహానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బోనులో ఉన్న సింహంతో ఓ వ్యక్తి పరాచికాలు ఆడతాడు. ఒక్కసారిగా దానికి తిక్క లేచి.. ఆ వ్యక్తికి చుక్కలు చూపిస్తుంది.


సౌతాఫ్రికాలోని సెనెగల్ ప్రాంతంలో ఉన్న పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. సందర్శకులంతా అందులోని జంతువులను చూస్తూ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సింహం బోను వద్దకు వెళ్తాడు. లోపల ఉన్న సింహం డల్‌గా కనిపిస్తుంది. తర్వాత ఆ వ్యక్తిని చూసి గాండ్రిస్తుంది. కొద్దిసేపు దాన్ని గమనించిన ఆ వ్యక్తి.. ఏం చేస్తుందిలే అనుకుని, హాయ్ హాయ్.. అంటూ సింహం మొఖం ముందు చేయి పెడతాడు. అదునుకోసం ఎదురు చూస్తున్న సింహం.. ఒక్కసారిగా నోటితో చేయిని పట్టుకుంటుంది. దీంతో షాకైన ఆ వ్యక్తి.. దాని నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో దాని తల మీద మరో చేతితో బాదతాడు. కొద్దిసేపటి తర్వాత ఎట్టకేలకు దాని బారి నుంచి బయటపడతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహంతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది మరి.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రైలు పట్టాలు దాటుతోన్న 20 ఏళ్ల యువతి.. హఠాత్తుగా కదిలిన గూడ్సు రైలు.. ఓ వ్యక్తి చేసిన రిస్క్ ఇదీ..!



Updated Date - 2022-02-13T03:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising