ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు బంపరాఫర్.. ఏడాదికి రెండు ఇంక్రిమెంట్లు, కంపెనీలోని ఉద్యోగులకు పెళ్లి సంబంధాలు..

ABN, First Publish Date - 2022-05-02T18:26:54+05:30

ప్రస్తుతం నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం సంస్థలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం సంస్థలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వలసలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం తాయిలాలు ప్రకటిస్తున్నాయి. తమిళనాడులోని మధురైకి చెందిన శ్రీ మూకాంబిక ఇన్ఫో సొల్యూషన్స్ సంస్థ అధినేత తమ సంస్థ ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. 


ఈ సంస్థ యూఎస్‌లో క్లయింట్లకు సాఫ్ట్‌వేర్ సేవలు అందిస్తుంటుంది. 2006లో శివకాశిలో ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా అభివృద్ధి చెంది మధురైకి మారింది. సదరు కంపెనీ ఫౌండర్, సీఈవో సెల్వగణేష్ ఉద్యోగుల కోసం బంపరాఫర్లు ప్రకటించారు. ఇకపై, ఏడాదికి రెండు సార్లు ఇంక్రిమెంట్ ఇస్తామని తెలిపారు. అలాగే, సంస్థలో బ్యాచిలర్ ఉద్యోగులకు పెళ్లి సంబంధాలను చూడటానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతేకాదు పెళ్లి చేసుకునే ఉద్యోగికి ప్రత్యేకమైన ఇంక్రిమెంట్లు కూడా ఇస్తామన్నారు. 


ప్రస్తుతం తమ కంపెనీలో పని చేస్తున్న 40 శాతం మంది ఉద్యోగులు ప్రారంభం నుంచి ఇక్కడే ఉన్నారని, వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించామని సెల్వ గణేష్ చెప్పారు. తమ కంపెనీలో చేరిన ఉద్యోగికి తొలిరోజు నుంచే ఫిక్స్‌డ్ ఇంక్రిమెంట్స్ ఉంటాయని చెప్పారు. చెన్నై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగస్థులు సులభంగా దొరుకుతున్నప్పటికీ.. మధురై వంటి టూ-టైర్ సిటీస్‌లో ఆ కొరత ఎక్కువగా ఉందన్నారు. 


Updated Date - 2022-05-02T18:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising