ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చాణక్య నీతి: ప్రేమను పొందేందుకు మూడు సూత్రాలు.. విస్మరిస్తే బాధపడతారు!

ABN, First Publish Date - 2022-03-05T12:31:08+05:30

ఆచార్య చాణక్యునికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆచార్య చాణక్యునికి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆచార్య చాణక్యుడు చరిత్రలో అత్యంత తెలివైన వ్యక్తులలో ఒకనిగా గుర్తింపుపొందారు. ఏ నిర్ణయమైనా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య ఆలోచనలు చాణక్య నీతిలో కనిపిస్తాయి. ఆచార్య చాణక్య తెలిపిన ఈ విధానాలు ప్రస్తుత కాలంలో కూడా చాలా సందర్భోచితంగా ఉపయోగపడుతున్నాయి. చాణక్య నీతిలోని పలు విషయాలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి. జీవితంలోని ప్రతి అంశం గురించి చెప్పిన చాణక్యుడు ప్రేమ వ్యవహారాల గురించి కూడా తన అభిప్రాయాలను తెలిపారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం పరిమితులకు లోనయిన సంబంధం కంటే స్వేచ్ఛ‌తో కూడిన సంబంధాలు బలమైనవిగా ఉంటాయి. అవి పరిణతి చెందినవి. ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం  ఎదుటి వ్యక్తితో సంబంధం బలంగా ఉండాలని మీరు కోరుకుంటే, వారికి తగినంత స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రతి వ్యక్తి తన తోటివారు తనను గౌరవించాలని కోరుకుంటాడు. దీనిని గుర్తుంచుకుని ఎదుటివారి ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ దెబ్బతీయకూడదని చాణక్యుడు హితవు పలికాడు. ఎందుకంటే ఎదుటివారి గౌరవాన్ని దెబ్బతీస్తే అది సంబంధాలను బలహీనపరుస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో అహంకారానికి తావు ఉండకూడదని చాణక్యుడు చెప్పాడు. అహంకారం కారణంగా ఆ  వ్యక్తి తన సహజ స్థితిని మరచిపోతాడు. మీ ఎదుటి వ్యక్తికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అది సంబంధాలను దెబ్బతీస్తుంది. అందుకే అహంకారం పనికిరాదని చాణక్య తెలిపారు. ప్రేమ అనేది ప్రదర్శన కోసం చేసేది కాదని, అలాచేస్తే వారు స్వార్థపరులవుతారని చాణక్య తెలిపారు. ప్రేమలో పడిన స్త్రీ, పురుషులు ఒకరిపై ఒకరు అచంచలమైన నమ్మకాన్ని కలిగి ఉండాలని చాణక్య తెలిపారు. స్వేచ్ఛ లేని సంబంధాలు, కొంతకాలం తర్వాత  దిగజారిపోతాయని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2022-03-05T12:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising