ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Govt Jobs: అదృష్టం అంటే ఇదే కదా.. ఒకే కుటుంబంలో ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇంకో విశేషం ఏంటో తెలుసా..

ABN, First Publish Date - 2022-10-13T02:31:36+05:30

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఆ అదృష్టం కొందరినే వరిస్తుంటుంది. సాధారణంగా తల్లిదండ్రులంతా తమ పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని కోరిక ఉంటుంది. కానీ ఆ అదృష్టం కొందరినే వరిస్తుంటుంది. సాధారణంగా తల్లిదండ్రులంతా తమ పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగులు.. వారి పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా కుటుంబాల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుటుంబంలో మాత్రం అలా జరగలేదు. ప్రభుత్వ ఉద్యోగులైన తండ్రులు.. తమ పిల్లలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకున్నారు. అయితే వారి ముగ్గురు పిల్లలు అంతకు మించి ఘనత సాధించారు. తండ్రులకు మంచిన తనయుడు, తనయలు అని అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..


బీహార్ (Bihar) దర్భంగా జిల్లాలోని నౌదేగా గ్రామానికి చెందిన సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ అన్నదమ్ములు. సురేంద్రకు నేహా, షిప్రా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే అజయ్ కుమార్‌కు అనంత్ కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. వీరంతా ఉమ్మడిగా నివాసం ఉంటున్నారు. మారథాన్ రన్నర్ అయిన సురేంద్ర లాల్‌దేవ్.. బీహార్ పోలీసు శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా (Sub Inspector) పని చేస్తున్నాడు. అలాగే అజయ్ కుమార్.. దర్భంగాలోని మధురాపూర్ మిడిల్ స్కూల్ హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. అన్నదమ్ములు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో.. తమ పిల్లలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు (Government employees) వస్తే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు. వారి పిల్లలు ముగ్గురూ LLM వరకు చదువుకున్నారు.

Train Ticket Cancellation: రైల్వే ప్రయాణీకులకు ఇంపార్టెంట్ అలెర్ట్.. Chart ప్రిపేర్ అయిన తర్వాత కూడా టికెట్‌ను కేన్సిల్ చేస్తే..


తండ్రి మాదిరే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నది వారి ఆశయం. అయితే చివరకు తండ్రుల ఆశాయాలకు మించి పిల్లలు తమ ప్రతిభను చాటి ఉన్నతోద్యోగాలు సంపాదించారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (Bihar Public Service Commission) సంబంధిచిన 31వ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలు సోమవారం అర్థరాత్రి విడుదలయ్యాయి. ఇందులో చరిత్ర సృష్టిస్తూ సురేంద్ర లాల్‌దేవ్, అజయ్ కుమార్ పిల్లలు ముగ్గురూ ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. వీరంతా మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాలు సాధించారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ముగ్గురూ ఉన్నతోద్యోగాలు సాధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసినా వీరి గురించే చర్చించుకుంటున్నారు. 

పొలంలో చేతి పంపు నుంచి ఉబికివస్తున్న మద్యం.. ఏడు అడుగుల లోతు తవ్వి చూడగా.. షాకింగ్ సీన్.. 



Updated Date - 2022-10-13T02:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising