ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Beware: తరచూ ముక్కులో వేలు పెట్టుకునే అలవాటుందా.. అయితే ఈ వ్యాధి రావొచ్చు జాగ్రత్త!

ABN, First Publish Date - 2022-11-06T11:23:44+05:30

కొందరికి మాటి మాటికీ ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఒంటరిగా ఉన్నా నలుగురులో ఉన్నా.. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా తరచూ వేలును ముక్కులో పెడుతూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా డేంజర్ అట. భయంకరమైన వ్యాధిబారిన పడే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: కొందరికి మాటి మాటికీ ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది. ఒంటరిగా ఉన్నా నలుగురులో ఉన్నా.. ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచన కూడా లేకుండా తరచూ వేలును ముక్కులో పెడుతూ ఉంటారు. అయితే అలా చేయడం చాలా డేంజర్ అట. భయంకరమైన వ్యాధిబారిన పడే అవకాశం ఉందట. ఇవి గాలి మాటలు కాదు. వైద్య నిపుణులు పరిశోధనలు జరిపి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇలాంటి అలవాలు ఉంటే వెంటనే మానుకోవాని సూచిస్తున్నారు.

జరిగేది ఇదేనట..

ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ విశ్వవిద్యాలయం(Griffith University) పరిశోధకులు తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టారు. మాటికి మాటికీ ముక్కులో వేలు పెట్టుకునే వాళ్లలో జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందట. ఈ క్రమంలోనే వాళ్లు అల్జీమర్స్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. ఎలుకలపై పరిశోధనలు చేసినప్పుడు ఈ విషయాన్ని గుర్తించినట్టు చెప్పారు. తరచూ ముక్కులో వేలు పెట్టుకోవడం ద్వారా ముక్కులోని సున్నితమైన పొరలు దెబ్బతిని.. బ్యాక్టీరియా మెదడు వరకూ చేరుతుందని తెలిపారు. అలా వెళ్లిన బ్యాక్టీరియా.. మెదడులోని కణాలు దెబ్బతీస్తుందని ఫలితంగా జ్ఞాపకశక్తి మందగిస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా భయంకరమైన అల్జీమర్స్ వ్యాధి బారినపడే అవకాశం ఉందని తాము గుర్తించినట్టు వెల్లడించారు.

అల్జీమర్స్ వ్యాధి అంటే..

మెదడులోని కణాలు చనిపోవడం వల్ల వచ్చే నాడీ సంబంధ వ్యాధిగా అల్జీమర్స్‌ను చెప్పవచ్చు. ఈ వ్యాధి బారినపడిన వారికి జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం దెబ్బతింటాయి. వ్యాధి బారినపడిన వాళ్లు ప్రారంభంలో ఇటీవల జరిగిన సంఘటనలు, సంభాషణలను మర్చిపోతారు. వ్యాధి ముదిరే కొద్దీ.. తీవ్రమైన జ్ఞాపకశక్తి బలహీనతతో బాధపడతారు. రోజూ వారీ పనులను కూడా నిర్వహించే సామర్థ్యాన్ని కోల్పోతారు. సాధారణంగా 60-65 మధ్య వయసు వాళ్లు ఈ వ్యాధి బారినపడుతూ ఉంటారు.

Updated Date - 2022-11-06T11:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising