ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Controlling Husband: భర్తలను కంట్రోల్ చేయడం ఎలా..? భార్యలకు చిట్కాలు చెప్తూ సంపాదిస్తున్న మహిళ..!

ABN, First Publish Date - 2022-11-28T14:47:27+05:30

తన భర్త పూర్తిగా తను చెప్పినట్టే వినాలని ప్రతి భార్యా కోరుకుంటుంది. అలా జరగనపుడు చాలా మంది అసహనానికి గురవుతుంటారు. అలాంటి భార్యల కోసం ఓ మహిళ కోచింగ్ క్లాస్‌లు ప్రారంభించింది. భర్తలను కంట్రోల్ చేయడం ఎలా..? (How to Control Husbands) అనే టాపిక్‌పై ఆన్‌లైన్ క్లాస్‌లు చెబుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన భర్త పూర్తిగా తను చెప్పినట్టే వినాలని ప్రతి భార్యా కోరుకుంటుంది. అలా జరగనపుడు చాలా మంది అసహనానికి గురవుతుంటారు. అలాంటి భార్యల కోసం ఓ మహిళ కోచింగ్ క్లాస్‌లు ప్రారంభించింది. భర్తలను కంట్రోల్ చేయడం ఎలా..? (How to Control Husbands) అనే టాపిక్‌పై ఆన్‌లైన్ క్లాస్‌లు చెబుతోంది. అందుకు ఫీజులు కూడా వసూలు చేస్తోంది. ఆమె పేరు మార్గరీటా నజరెంకో (Margarita Nazarenko). ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీకి చెందిన 34 ఏళ్ల మార్గరీటా క్లాస్‌లకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరుగుతోందట. కొంచెం తెలివితేటలను, మహిళలకే సొంతమైన నైపుణ్యాన్ని ఉపయోగిస్తే మగమహారాజులను కంట్రోల్ చేయడం సులభమని మార్గరీటా చెబుతోంది.

మహిళల ప్రవర్తనను మూడు జంతువులతో పోల్చి మార్గరీటా వివరిస్తోంది. మొదటి జంతువు జింక (Deer). జింక అనేది స్త్రీ శక్తికి ప్రతీకని, జింక ప్రమాదాన్ని సులభంగా గ్రహిస్తుందని, చిన్న అనుమానం వచ్చినా అక్కడి నుంచి వెళ్లిపోతుందని, మహిళలు జింకలా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక, ఆమె పేర్కొన్న రెండో జంతువు ఆవు (Cow). పాడి ఆవు ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు చేసి అలసిపోతుందని, తన గురించి ఆలోచించుకోదని, మహిళలు ఒక హద్దు నిర్ణయించుకుని.. అక్కడి వరకే బాధ్యతలు నెరవేర్చాలని తెలిపింది. ఇక, మూడో జంతువు గుర్రం (Horse). కొందరు మహిళలు ఖర్చులన్నీ భరించి, తమతో ఉండడం ఇష్టం లేని మగవాళ్ల వెంట పరుగెత్తుతుంటారని, గమ్యం తెలియని ప్రయాణం ప్రమాదకరమని మార్గరీటా సూచించింది.

మహిళలు ఎప్పుడూ జింకల్లా తమ గురించి ఆలోచిస్తూ అప్రమత్తంగా ఉండాలని మార్గరీటా సలహా ఇస్తోంది. మగవారు తమ మాట వినాలని మహిళలు అనుకుంటే ముందు వారితో గొడవ పడడం మానెయ్యాలి. ఎల్లప్పుడూ మీ పురుష భాగస్వామిలోని మంచి లక్షణాలను మెచ్చుకుంటూ ఉండండి. అతను మార్చలేని విషయాల గురించి ఫిర్యాదులు చేయడం మానండి. ముందు మానసికంగా, శారీరకంగా మీరు బలవంతులు కండి. అప్పుడు పురుషులు మీరేం చెబుతున్నారో వింటారని మార్గరీటా సూచిస్తోంది. ఇవేకాకుండా, ఆన్‌లైన్ కోర్సు ద్వారా మరిన్ని చిట్కాలు చెబుతోంది. ఆ క్లాస్‌లు వినాలనుకునేవారు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-28T14:47:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising