ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు రోబోల అవసరం లేదు.. కావాలంటే ఈ Viral Video చూడండి!

ABN, First Publish Date - 2022-05-17T01:40:42+05:30

ప్రపంచంలో చాలా దేశాలు రోబోటిక్ ఆటోమేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో చాలా దేశాలు రోబోటిక్ ఆటోమేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మనుషుల అవసరం లేకుండా రోబోల సహాయంతో చాలా పనులు జరిగిపోతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం చాలా రంగాల్లో ఇంకా మనుషులే కార్యకలాపాలు సాగిస్తున్నారు. రోబోలకు మాత్రమే సాధ్యమైన ఖచ్చితత్వంతో, సమన్వయంతో భారతీయులు చక్కగా పనులు చేయగలరని నార్వేకు చెందిన మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోలైమ్ పేర్కొన్నారు. 


సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఓ వీడియోను షేర్ చేసిన ఎరిక్.. భారత్‌కు రోబోటిక్ ఆటోమేషన్ అవసరం లేదని పేర్కొన్నారు. ఆ వీడియోను భారత్‌లోని ఓ రైతు బజార్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు క్యాబేజీలను అత్యంత వేగంగా కత్తిరించి గోనెలో క్రమ పద్ధతిలో వేస్తున్నారు. నిమిషం కంటే తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా వారు ఆ పని పూర్తి చేశారు. ఆ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


ఆ వీడియోను దాదాపు ఆరు లక్షల మంది వీక్షించారు. ఆ వీడియోను ఎరిక్ తన ట్విట్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియోపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. అత్యధిక మానవ వనరులున్న భారత్‌కు మెషిన్ల అవసరం లేదని చాలా మంది వ్యాఖ్యానించారు. `వీళ్లకు ఆర్థికంగా, వైద్య పరంగా ఎలాంటి భద్రతా ఉండదు. మాకు రోబోలు అక్కర్లేదు. మెరుగైన సౌకర్యాలు, మద్దతు అవసరం. కానీ, కార్మికులు వాటిని కోరుకుంటే ఆ తర్వాత వచ్చేది యంత్రీకరణే` అని మరొకరు కామెంట్ చేశారు.  



Updated Date - 2022-05-17T01:40:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising