Viral News: 15ఏళ్ల క్రితం ఈఫిల్ టవర్‌ను పెళ్లాడిన ఈ మహిళ.. ఇపుడు Fence(కంచె)పై మనసు పడిందట
ABN, First Publish Date - 2022-07-01T15:32:23+05:30
ఆమెకు ప్రస్తుతం 50 సంవత్సరాలు. సుమారు 15ఏళ్ల కింద ఈఫిల్ టవర్‌ను బంధు మిత్రుల సమక్షంలో పెళ్లాడి ప్రపంచానికి షాకిచ్చింది. తాజాగా మరో సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈఫిల్ టవర్‌పై ప్రేమ తగ్గిపోయినట్టు వెల్ల
ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు ప్రస్తుతం 50 సంవత్సరాలు. సుమారు 15ఏళ్ల కింద ఈఫిల్ టవర్‌ను బంధు మిత్రుల సమక్షంలో పెళ్లాడి ప్రపంచానికి షాకిచ్చింది. తాజాగా మరో సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈఫిల్ టవర్‌పై ప్రేమ తగ్గిపోయినట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఇపుడు తాను ఓ కంచె(Fence)పై మనసు పారేసుకున్నట్టు పేర్కొంది. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కాగా.. ఆమెకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రేమ అనేది ఇద్దరి మనుషుల మధ్యే ఉండనక్కర్లేదు.. మనల్ని మనం ప్రేమించుకోవచ్చు.. మన పెంపుడు జంతువులను కూడా ప్రేమించవచ్చు.. తాజ్‌మహల్‌ను ఇష్టపడొచ్చు.. అయితే పెళ్లి మాత్రం ఇద్దరు మనుషుల మధ్యే జరుగుతుందనేది ఒకప్పటి వాదన. ఇపుడు ట్రెండ్ మారింది. కాదు.. కాదు.. కొందరు ట్రెండ్ మార్చారు. ఎంతగానో ప్రేమించిన వస్తువులు, జంతువులను పెళ్లి చేసుకుంటున్నారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఎరికా కూడా ఈ కోవకు చెందినదే. వస్తువులపై లైంగిక ఆసక్తి పెంచుకున్న ఈమె.. 2007లో పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. అంతేకాకుండా తన పేరును చట్టబద్ధంగా ఎరికా లా టూర్ ఈఫిల్గా మార్చుకుంది కూడా.
ప్రస్తుతం 50ఏళ్ల వయసున్న ఈమె.. తాజాగా సోషల్ మీడియా ద్వారా సంచలన ప్రకటన చేసింది. ఈఫిల్ టవర్‌పై వ్యామోహం తగ్గిపోయిందని వెల్లడించింది. ప్రస్తుతం తన మనసు కంచెను(Fence) కోరుకుంటుదని చెప్పుకొచ్చింది. కంచెను చూసి ఆకర్షితురాలైనట్టు తెలిపిన ఆమె.. దాని గురించి తెలుసుకోనేందుకు ఆసక్తిగా ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఆమె ప్రకటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉంటే.. ఇలా వస్తువులతో ఒక్క ఎరికానే కాకుండా ప్రపంచంలో చాలా మంది రిలేషన్ పెట్టుకున్నారు. జర్మనీకి చెందిన సారాహ్ రోడో అనే యువతి బోయింగ్ 737తో రొమాన్స్ చేస్తున్నట్టు కొద్ది రోజుల క్రితమే వెల్లడించింది. జర్మనీకే చెందిన ఓ పోస్ట్ మ్యాన్ తన పెంపుడు పిళ్లిపై ఉన్న ప్రేమతో దాన్ని వివాహం చేసుకున్నాడు.
Updated Date - 2022-07-01T15:32:23+05:30 IST