ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ గ్రామంలో ఇప్పటికీ ప్రజలెవరూ చెప్పులు వేసుకోరు.. అందుకు బలమైన కారణమే ఉంది!

ABN, First Publish Date - 2022-06-20T00:24:01+05:30

ప్రపంచం సాకేంతిక రంగంలో దూసుకుపోతుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ప్రజలకు లగ్జరీ లైఫ్‌ను పొందాలని ఎగబడుతున్నారు. అయితే.. ఓ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం.. ఇప్పటికీ తమ ఊరిలో చెప్పులు ధరించరు. ఎండాకాలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం సాకేంతిక రంగంలో దూసుకుపోతుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ప్రజలకు లగ్జరీ లైఫ్‌ను పొందాలని ఎగబడుతున్నారు. అయితే.. ఓ గ్రామానికి చెందిన ప్రజలు మాత్రం.. ఇప్పటికీ తమ ఊరిలో చెప్పులు ధరించరు. ఎండాకాలంలో కాళ్లు కాలుతున్నా సరే.. ఆ బాధను భరిస్తారే తప్పా చెప్పుల జోలికి అస్సలు వెళ్లరు. ఆ గ్రామ ప్రజలు మాత్రం దీనికి బలమైన కారణం ఉందని అంటున్నారు. కాగా.. అందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



తమిళనాడులో వెల్లగావి అనేది చిన్న గ్రామం. అడవిలో ఉన్న కొండ ప్రాంతంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ ఊరికి వెళ్లాలంటే సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. ఎవరైనా ఇక్కడికి వెళ్లాలంటే.. ట్రెక్కింగ్ చేయాల్సిందే. అయితే ఈ గ్రామంలోని ప్రజలు ఎవ్వరూ చెప్పులు వేసుకుని ఊరిలో తిరగరు. ఊరి సరిహద్దులో ఉన్న చెట్టు వద్దకు చేరుకోగానే కాళ్ల నుంచి చెప్పులు  విప్పేస్తారు. నాగరికత పేరుతో సిటీలోని ప్రజలు ఇళ్లలో చెప్పులు వేసుకుని తిరుగుతారు.. కానీ గ్రామాల్లో మాత్రం వాటిని ధరించి ఇంట్లో తిరగరు. అదే విధంగా వెల్లగావి గ్రామ ప్రజలు కూడా తమ గ్రామాన్ని పవిత్రమైన స్థలంగా భావిస్తారు. అందువల్ల ఇక్కడ ప్రజలు చెప్పులు కానీ బూట్లు గానీ వేసుకుని గ్రామంలో తిరగరు. కాదని ఎవరైనా వేసుకుంటే.. గ్రామ ప్రజల ఆగ్రహానికి గురవుతారు. అంతేకాకుండా కఠినంగా శిక్షిస్తరు కూడా. ఎండాకాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం.. వృద్ధులకు మినహాయింపు ఇస్తారు. 


ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. సాయంత్రం 7 గంటలకల్లా ఈ గ్రామ ప్రజలు నిద్రకు ఉపక్రమిస్తారు. గట్టిగా మాట్లాడటం కానీ.. మ్యూజిక్ వినడం, పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు ప్లే చేయడం లాంటివి వాటికి ఇక్కడ అనుమతి లేదు. ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా తామంతా సంతోషంగా ఉన్నామని ఇక్కడి ప్రజలు అంటున్నారు.


Updated Date - 2022-06-20T00:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising