ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చెట్టును కాపాడేందుకు సాహసం.. తుఫానుతో యుద్ధం..

ABN, First Publish Date - 2022-06-19T21:35:57+05:30

ఓ చెట్టు కోసం ఓ యువకుడు తుఫానుతో యుద్ధం చేశాడు.. గాలి, వానా బీభత్సంలో చెట్టు కోసం ఒంటరి పోరాటం చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ చెట్టు కోసం ఓ యువకుడు తుఫానుతో యుద్ధం చేశాడు.. గాలి, వానా బీభత్సంలో చెట్టు కోసం ఒంటరి పోరాటం చేశాడు.. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..  బలమైన గాలివానలకు భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా నేల రాలిపోతాయి. అలాంటిది అత్యంత బలహీనమైన అరటి చెట్లు చాలా సులభంగా పడిపోతాయి. తన పొలంలో ఉన్న ఓ అరటిచెట్టు అలా పడిపోకుండా ఓ యువకుడు కాపాడే ప్రయత్నం చేశాడు. 


ఆ వీడియో ప్రకారం.. గాలి వాన హోరులో అరటి చెట్టు ఊగిపోతోంది. మరికొద్ది సేపు ఉంటే వేళ్లతో సహా ఎగిరిపోయేలా ఉంది. దాంతో ఓ యువకుడు ఆ చెట్టును గట్టిగా పట్టుకుని గాలి వానలో నిలబడ్డాడు. భయంకరమైన గాలిని, వానను పట్టించుకోకుండా చెట్టు కోసం రక్షణగా నిలబడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. `ఆ వ్యక్తి చెట్టును కాదు.. మన భవిష్యత్తును కాపాడుతున్నాడ`ని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. కాగా, అది కేవలం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం చేసిన వీడియో అని కొందరు అంటున్నారు. 



Updated Date - 2022-06-19T21:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising