ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే..

ABN, First Publish Date - 2022-01-11T00:50:51+05:30

తమిళనాడులో ఓ ప్రేమ జంటకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కూతురు క్షేమంగా ఉంటుందనుకున్న తల్లిదండ్రుల ఆశలు.. ఏడాది దాటగానే అడియాశలయ్యాయి. చివరకు ఈ సమస్య ఎంత వరకు వెళ్లిందంటే..

భర్త ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న అమ్ము
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమ పెళ్లిళ్లు చేసే పెద్దలు.. భార్యాభర్తలు జీవితాంతం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో అంగీకరిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోని ఘటనలు జరిగి కాపురాలు చిన్నాభిన్నమవుతుంటాయి. తమిళనాడులో ఓ ప్రేమ జంటకు పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. కూతురు క్షేమంగా ఉంటుందనుకున్న తల్లిదండ్రుల ఆశలు.. ఏడాది దాటగానే అడియాశలయ్యాయి. చివరకు ఈ సమస్య ఎంత వరకు వెళ్లిందంటే..


తమిళనాడు తిరువణ్ణామలై పోలూరు సమీపం పాపంబాడి గ్రామానికి చెందిన పూఅరసన్‌(22).. చెన్నైలో వ్యాన్ నడుపుతుంటాడు. ఈ క్రమంలో అతడికి కల్లకుర్చికి చెందిన అమ్ము(22)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం చివరికి ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. పెద్దలకు తెలియజేశారు. మొదట వారు అంగీకరించకున్నా.. తర్వాత వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించారు. బంధువులందరినీ పిలిచి ఏడాది క్రితం ఘనంగా పెళ్లి చేశారు. తర్వాత భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..


ఈ క్రమంలో రెండు నెలల క్రితం అమ్ము భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటికి గర్భిణిగా ఉన్న అమ్మును.. తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. కొన్నాళ్ల తర్వాత భర్త కుటుంబ సభ్యులతో వివాదం తలెత్తింది. అమ్మును వదిలించుకునేందుకు అత్తమామలు తమ ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. దీంతో వివాహ సమయంలో ఇచ్చిన బంగారు, నగదును తమకు తిరిగి ఇవ్వాలని అమ్ము కుటుంబ సభ్యులు అడిగినా.. అటువైపు నుంచి స్పందన రాలేదు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటూ చెన్నై హైకోర్టులో ఫిటిషన్‌ దాఖలు చేసింది. విషయం తెలుసుకున్న అమ్ము అత్తమామలు ఇంటి నుంచి పరారయ్యారు. దీంతో శనివారం అత్తింటి ముందు అమ్ము తన బిడ్డతో ధర్నాకు దిగింది. పోలీసులు కలుగజేసుకుని ఆమెకు నచ్చజెప్ప పంపించారు.

ఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..

Updated Date - 2022-01-11T00:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising