ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాబోయ్ ఇది తాటి చెట్టు కాదు.. కంద మొక్క!

ABN, First Publish Date - 2022-05-27T15:48:11+05:30

ఇదిగో ఈ ఫొటో చూడగానే ఇదేంట్రా బాబోయ్.. తాటిచెట్టంత పొడవుంది.. అని అనుకుంటున్నారా.. అవును తాటిచెట్టంత పొడవుంది కానీ తాటి చెట్టయితే కాదండోయ్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ సిటీ : ఇదిగో ఈ ఫొటో చూడగానే ఇదేంట్రా బాబోయ్.. తాటిచెట్టంత పొడవుంది.. అని అనుకుంటున్నారా.. అవును తాటిచెట్టంత పొడవుంది కానీ తాటి చెట్టయితే కాదండోయ్.. ఇది ఒక మొక్క అంతే.. ఇదెక్కడో విదేశాల్లోనో.. ఇతర రాష్ట్రాల్లోనో ఉందనుకుంటున్నారేమో అదీ కాదు.. మన హైదరాబాద్ సిటీలోనే ఉంది.. ఈ మొక్కేంటి.. దాని ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


ఈ మొక్క పేరు కంద.. సాధారణంగా ఇళ్ళలో, తోటల్లో కనిపించే కంద (Elephant Foot Yam) మొక్కల పొడవు నాలుగు అడుగులకు మించదు.. కానీ హైదరాబాద్‌లోని కొంపల్లిలో.. పామ్ స్ర్పింగ్ అపార్ట్‌మెంట్స్, ఫ్లాట్ నెంబర్-103లో నివసిస్తున్న వెంకట రమేశ్‌బాబు పెరట్లో ఉన్న కంద మొక్క మాత్రం ఏకంగా 12.5 అడుగులు.. అంటే 3.7 మీటర్ల ఎత్తు పెరిగింది. దీన్ని చూసిన జనాలంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా అరుదైన కంద రకంగా అందరూ భావిస్తున్నారు. ఈ మొక్కను చూసిన స్థానికులు.. ఫొటోలు దిగడడానికి క్యూ కట్టేస్తున్నారు.



Updated Date - 2022-05-27T15:48:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising