ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది చూశారా.. ఆ Google సందేహాలు అడిగితే.. ఈ డాక్టర్ రూ.1000 వసూలు చేస్తాడట!

ABN, First Publish Date - 2022-06-07T01:14:39+05:30

తన దగ్గరకు వచ్చే పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని ఓ వైద్యుడు.. తాను అందించే చికిత్సకు సంబంధించి ఛార్జీల వివరాలను నోటీస్‌ బోర్డులో ప్రకటించాడు. ప్రస్తుతం ఆ ఛార్జీల వివరాల ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: తన దగ్గరకు వచ్చే పేషెంట్లను దృష్టిలో పెట్టుకుని ఓ వైద్యుడు.. తాను అందించే చికిత్సకు సంబంధించి ఛార్జీల వివరాలను నోటీస్‌ బోర్డులో ప్రకటించాడు. ప్రస్తుతం ఆ ఛార్జీల వివరాల ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆ సందేహాల నివృత్తికి అంత మొత్తంలో చెల్లించాలా అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సదరు వైద్యుడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. 


దాదాపు అందరికీ ప్రస్తుతం ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే విద్యావంతులు ప్రతి చిన్న విషయానికి సాంకేతికపై ఆధారపడిపోతున్నారు. తెలియని ప్రదేశానికి ఎలా వెళ్లాలనే విషయం దగ్గర నుంచి.. ఆఖరికి అన్నం వండేందుకు ఒక కప్పు బియ్యానికి ఎన్ని కప్పుల నీళ్లు పోయాలి? అనే విషయాన్ని కూడా ఇంటర్నెట్‌ను ఉపయోగించే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఒంట్లో కాస్త నలతగా ఉంటే.. దానికి సంబంధించిన లక్షణాలను గూగుల్ చేస్తూ వారి పరిస్థితి గల కారణాలను, చికిత్సలను తెలుసుకుని సొంత వైద్యం చేసుకుంటున్నారు. మరికొందరేమో.. గూగుల్‌లో లభించిన సమాచారం సరైనదేనా కాదా అనే అనుమానంతో డాక్టర్లను ఆశ్రయిస్తూ.. ప్రశ్నల మీద ప్రశ్నలతో వారి ప్రాణాలు తోడేస్తున్నారు. 



ఈ క్రమంలో తన దగ్గరకు వచ్చే పేషెంట్ల వైఖరితో విసిగిపోయిన ఓ డాక్టర్.. కీలక నిర్ణయం తీసుకున్నాడు. Google సందేహాల నివృత్తి కోసం తనను సంప్రదిస్తే.. సదరు పేషెంట్ల నుంచి రూ.1000 వసూలు చేయనున్నట్టు ఓపీడీ ఛార్జీల పట్టికలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను కూడా సదరు వైద్యుడు పేర్కొన్నాడు. ‘‘నా నిర్ధారణ, నా చికిత్స - రూ. 200; నా నిర్ధారణ, మీ చికిత్స - రూ 500; మీ Google సందేహాలు - రూ 1,000; మీ నిర్ధారణ, నా చికిత్స - రూ 1,500; మీ నిర్ధారణ, మీ చికిత్స - రూ 2,000." వసూలు చేయనున్నట్టు చికిత్సకు సంబంధించిన ధరల పట్టికలో వెల్లడించాడు. దీన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వైద్యులు మాత్రం.. సొంత చికిత్స ప్రమాదకరం అని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. 




Updated Date - 2022-06-07T01:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising